శాతకర్ణికి క్లాప్ కొట్టిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ఘనంగా ప్రారంభమైంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ సహా మంత్రులు హరీష్ రావు, తలసాని, కూడా హాజరయ్యారు. సినిమా ప్రారంబోత్స‌వానికి వ‌చ్చిన పెద్ద‌లంద‌రిని పేరు పేరునా పలకరించిన తెలంగాణ సీఎం…. తను అన్న‌గారి అభిమానిని అన‌గానే ఫ్యాన్స్ దాదాపు నిమిషం సేపు కేరింత‌ల‌తో హోరెత్తించారు.
గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి సినిమా 200రోజులు ఆడాల‌ని ఆకాంక్షించారు కేసీఆర్. మొద‌టి రోజు తను చిరంజీవితో కలిసి శాతకర్ణి సినిమా చూస్తానని కేసీార్ అన్నారు. దానికి బాల‌య్య త‌ప్ప‌కుండా చూపిస్తాన‌న్నారు. ఇక ఎన్టీఆర్ గార్డెన్ ను ఎట్టిప‌రిస్థితుల‌లో అక్క‌డి నుండి త‌ర‌లించమని… ఆయ‌న తెలుగు ప్ర‌జ‌ల కీర్తిని ప్ర‌పంచ వ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడని కేసీఆర్ పొగిడారు. తెలుగువారిని మ‌ద‌రాసీలు అంటున్న స‌మ‌యంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ ఒక‌టి ఉంద‌ని ప్ర‌పంచానికి చెప్పిన మ‌హాను భావుడుగా ఎన్టీఆర్ ను కీర్తించిన కేసీఆర్…. ఎన్టీఆర్ గార్డెన్ అక్క‌డే ఉంటుంద‌ని హామీ ఇచ్చారు.