శాంతి సందేశం త‌ల‌కెక్క‌లేదు… త‌ల‌న‌రికిన ఫొటో పంపారు!

ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదుల‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఆశించిన శ్రీశ్రీ ర‌విశంక‌ర్ కోరిక నేర‌వేర‌లేదు. వారితో శాంతి విష‌యమై చ‌ర్చించాల‌ని తాను చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేద‌ని, త‌న‌కు త‌ల తీసి ఉన్నఓ  వ్య‌క్తి ఫొటోని వారు పంపార‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్య‌వ‌స్థాప‌కులు శ్రీశ్రీ ర‌విశంక‌ర్ అన్నారు. త్రిపుర‌లోని అగ‌ర్త‌ల‌లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ర‌విశంక‌ర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ ప‌రిణామంతో ఇక తాను శాంతి చ‌ర్చ‌ల‌కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు ముగిసిన‌ట్టేన‌ని ఆయ‌న అన్నారు. ఐఎస్ ఉగ్ర‌వాదుల‌కు శాంతి చ‌ర్చ‌లు అవ‌స‌రం లేద‌ని, ఇక వారికి మిల‌ట‌రీతోనే స‌మాధానం చెప్పాల్సిఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.