Telugu Global
NEWS

లోకేష్ ని లోకల్ విలేకరితో పోల్చిన యనమల

లోకేష్, యనమల మధ్య గ్యాప్ ఉందన్న వార్తలు చాలాకాలంగావస్తున్నాయి. లోకేష్ పోరు భరించలేక యనమల రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా టీడీపీ నేతలు చెబుతుంటారు. లోకేష్ పై యనమలకు ఎలాంటి అభిప్రాయం ఉందన్న దానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాకినాడ పార్టీ కార్యాలయంలో యనమల ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరి ఒకరు ” చంద్రబాబు తర్వాత లోకేష్ సీఎం అవుతారా?. నెంబర్ టూగా ఉన్న మీ పరిస్థితి ఏమిటి అని […]

లోకేష్ ని లోకల్ విలేకరితో పోల్చిన యనమల
X

లోకేష్, యనమల మధ్య గ్యాప్ ఉందన్న వార్తలు చాలాకాలంగావస్తున్నాయి. లోకేష్ పోరు భరించలేక యనమల రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా టీడీపీ నేతలు చెబుతుంటారు. లోకేష్ పై యనమలకు ఎలాంటి అభిప్రాయం ఉందన్న దానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాకినాడ పార్టీ కార్యాలయంలో యనమల ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరి ఒకరు ” చంద్రబాబు తర్వాత లోకేష్ సీఎం అవుతారా?. నెంబర్ టూగా ఉన్న మీ పరిస్థితి ఏమిటి అని సదరు విలేకరి ప్రశ్నించారు. ఇందుకు యనమల కాసింత అసహనానికి గురయ్యారు.

లోకేష్ మంత్రి అవుతారా… లేక ముఖ్యమంత్రి అవుతారా అన్నది అప్రస్తుతమని తేల్చేశారు. అంతటితో ఆగలేదు యనమల. సీఎం పదవికేముంది లోకేష్ కావచ్చు… బొడ్డు వెంకటరమణ (లోకల్ విలేకరి) కావచ్చు అంటూ సెటైర్ వేశారు. యనమల కామెంట్ తో విలేకర్లు అవాక్కయ్యారు. లోకేష్, లోకల్ విలేకరి ఇద్దరూ ఒక్కటేనా అని ఆశ్చర్యపోయారు. లోకేష్ సీఎం అయితే స్థానిక విలేకరి కూడా సీఎం అవడంతో సమానం అన్నట్టు యనమల మాట్లాడడంపై ఆసక్తిగా చర్చించుకున్నారు. ఎన్టీఆర్ ని దించేసి చంద్రబాబును సీఎం కూర్చీలో కూర్చోబెట్టడంలో ఎంతో కష్టపడ్డ సీనియర్ నేత యనమల ఇలాంటి వాఖ్యాలు చేశారంటే మనసులో లోకేష్ పై ఏదో అసంతృప్తి ఉందని భావిస్తున్నారు.

Click on Image to Read:

roja1212

CM-Babu-Lal1

mla-shoba

roja

women-proprty

chandrababu-phone

lokesh

speaker-madhusudhana-chary

naresh-kumar-reddy

jagan

chevireddy-bonda-uma

ponguleti

MP-Mallareddy

Gali-Muddu-Krishnama-Naidu

nellore-leader

pub-disco

ysjagan-cbi-case

babu-birthday

First Published:  21 April 2016 11:51 PM GMT
Next Story