Telugu Global
WOMEN

ఆఫీస్‌లోంచి లాక్కెళ్లి...అత్యాచారం చేశాడు!

కొన్ని దారుణాలు, నేరాలు వింటూంటే అస‌లు మ‌న‌కో రాజ్యాంగం, చ‌ట్టం, న్యాయం అనేవి ఉన్నాయా, లేదా ఇంకా ఆట‌విక స‌మాజంలోనే ఉన్నామా అనే అనుమానం క‌లుగుతుంది. పంజాబ్‌లోని ముక్త్స‌ర్ జిల్లాలో అలాంటి ఘోర‌మే జ‌రిగింది. గ‌త‌నెల 25న ఓ దుండ‌గుడు ప‌ట్ట‌ప‌గ‌లు ఓ కంప్యూట‌ర్ సెంట‌ర్‌లోంచి,  అక్క‌డ ప‌నిచేస్తున్న ఓ ద‌ళిత యువతిని బ‌య‌ట‌కు ఈడ్చుకువ‌చ్చాడు. ఇదంతా  ద‌గ్గ‌ర‌లోని ఓ షాపు ముందున్న సిసి కెమెరాలో స్ప‌ష్టంగా రికార్డ‌యింది. త‌రువాత ఆమెను ట‌పాఖేరా గ్రామంలో ఉన్న ఒక […]

ఆఫీస్‌లోంచి లాక్కెళ్లి...అత్యాచారం చేశాడు!
X

కొన్ని దారుణాలు, నేరాలు వింటూంటే అస‌లు మ‌న‌కో రాజ్యాంగం, చ‌ట్టం, న్యాయం అనేవి ఉన్నాయా, లేదా ఇంకా ఆట‌విక స‌మాజంలోనే ఉన్నామా అనే అనుమానం క‌లుగుతుంది. పంజాబ్‌లోని ముక్త్స‌ర్ జిల్లాలో అలాంటి ఘోర‌మే జ‌రిగింది. గ‌త‌నెల 25న ఓ దుండ‌గుడు ప‌ట్ట‌ప‌గ‌లు ఓ కంప్యూట‌ర్ సెంట‌ర్‌లోంచి, అక్క‌డ ప‌నిచేస్తున్న ఓ ద‌ళిత యువతిని బ‌య‌ట‌కు ఈడ్చుకువ‌చ్చాడు. ఇదంతా ద‌గ్గ‌ర‌లోని ఓ షాపు ముందున్న సిసి కెమెరాలో స్ప‌ష్టంగా రికార్డ‌యింది. త‌రువాత ఆమెను ట‌పాఖేరా గ్రామంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌కి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. దుండ‌గుడు గురీంద‌ర్ (25) కాగా, ఆ ద‌ళిత యువ‌తి 25 ఏళ్ల‌ లోపు వ‌య‌సులో ఉంది. ఆమె త‌న‌ని గురీంద‌ర్ లాక్కువెళుతున్న స‌మ‌యంలో పెద్ద‌గా కేకలు వేసినా ఏ ఒక్క‌రూ స‌హాయంగా రాలేదు. త‌రువాత రోజు అత‌ను ఆ యువ‌తిని వ‌దిలేశాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన ఐదురోజుల‌కు యువ‌తి చేసిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు గురీంద‌ర్‌ని అరెస్టు చేశారు. అత‌నికి శిక్ష ప‌డ‌క‌పోతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని యువ‌తి త‌మ‌తో చెప్పిన‌ట్టుగా పోలీసులు వెల్ల‌డించారు.

పోలీసులు గురీంద‌ర్‌ని శుక్ర‌వారం ముక్త్స‌ర్ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. కోర్టు అత‌నికి మూడురోజులు పోలీస్ క‌స్ట‌డీ విధించింది. ఆ యువ‌తీయువ‌కులు ఇద్ద‌రూ ఒకేగ్రామానికి చెందిన‌వార‌ని పోలీసులు వెల్ల‌డించారు.

ఆరోజు ఆ యువ‌కుడు కంప్యూట‌ర్ సెంట‌ర్‌కి వ‌చ్చి యువ‌తితో మాట్లాడాడ‌ని, దాంతో వారిద్ద‌రికీ ప‌రిచ‌యం ఉంద‌ని తాము అనుకున్నామ‌ని, అయితే అత‌డు ఆమెని లాక్కుని వెళుతున్న‌ప్పుడు మాత్రం తాము ముందు ఆశ్చ‌ర్య‌పోయామ‌ని, త‌రువాత అత‌డిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం లేక‌పోయింద‌ని యువతి ప‌నిచేస్తున్న‌ కంప్యూట‌ర్ సెంట‌ర్ య‌జ‌మాని తెలిపాడు. త‌న‌కు త్వ‌ర‌గా న్యాయం చేయాలని కోరుతూ షెడ్యూలు కులాల జాతీయ క‌మిష‌న్‌ని ఆమె తండ్రితో క‌లిసి వెళ్లి సంప్ర‌దించిన‌ట్టుగా తెలుస్తోంది.

First Published:  23 April 2016 3:37 AM GMT
Next Story