Telugu Global
NEWS

ఎపిలో ఇంజినీర్ ఇళ్ల‌పై ఎసిబి దాడులు...కోటిన్న‌ర ఆస్తుల గుర్తింపు!

అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు విజ‌య‌వాడ‌కు చెందిన ఓ ఇంజినీరు ఇళ్లపై దాడులు నిర్వ‌హించారు. ఆదాయానికి మించి ఆస్తులను క‌లిగి ఉన్నాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో రెడ్డి వేణుగోపాల రావు అనే ఇంజినీర్ ఇళ్ల‌పై దాడులు చేసిన అధికారులు, ఆయ‌న‌ 1.56 కోట్ల రూపాయ‌ల విలువ‌చేసే ఆస్తుల‌ను క‌లిగిఉన్న‌ట్టుగా గుర్తించారు. రెడ్డి వేణుగోపాల రావు  ఆంధ్ర‌ప్ర‌దేశ్ హౌసింగ్ కార్పొరేష‌న్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఎసిబి అధికారులు  విజ‌య‌వాడ‌తో పాటు, బొబ్బిలోని ఆయ‌న మ‌రో ఇంట్లోనూ, ఇంకా విశాఖప‌ట్ట‌ణం, విజ‌య‌న‌గ‌రంలోని […]

అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు విజ‌య‌వాడ‌కు చెందిన ఓ ఇంజినీరు ఇళ్లపై దాడులు నిర్వ‌హించారు. ఆదాయానికి మించి ఆస్తులను క‌లిగి ఉన్నాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో రెడ్డి వేణుగోపాల రావు అనే ఇంజినీర్ ఇళ్ల‌పై దాడులు చేసిన అధికారులు, ఆయ‌న‌ 1.56 కోట్ల రూపాయ‌ల విలువ‌చేసే ఆస్తుల‌ను క‌లిగిఉన్న‌ట్టుగా గుర్తించారు. రెడ్డి వేణుగోపాల రావు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హౌసింగ్ కార్పొరేష‌న్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఎసిబి అధికారులు విజ‌య‌వాడ‌తో పాటు, బొబ్బిలోని ఆయ‌న మ‌రో ఇంట్లోనూ, ఇంకా విశాఖప‌ట్ట‌ణం, విజ‌య‌న‌గ‌రంలోని ఆయ‌న బంధువులు, స్నేహితుల ఇళ్ల‌మీద కూడా ఏక‌కాలంలోదాడులు నిర్వ‌హించారు.

16 ఇళ్ల‌స్థ‌లాలు, మూడు భ‌వ‌నాలు, రెండు షాపులు, ప‌ది ల‌క్ష‌ల విలువైన ప్రామిస‌రీ నోట్లు, ఆరుల‌క్ష‌ల బ్యాంక్ బ్యాల‌న్స్ త‌దిత‌ర స్థిర చ‌ర ఆస్తుల‌కు సంబంధించిన డాక్యుమెంట్ల‌ను వారు క‌నుగొన్నారు. వీటితో బాటు రెండు మోటార్ బైక్‌లు, ఒక కారు ఉన్నాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. వీట‌న్నింటినీ క‌లిపితే 1.56 కోట్ల విలువ చేస్తాయిని, ఆయ‌న ఆదాయానికి, ఆస్తుల‌కు సంబంధం లేద‌ని వారు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన అధికారులు, విశాఖ‌ప‌ట్ట‌ణంలోని ఎసిబి కోర్టులో ఆదివారం ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని తెలిపారు.

First Published:  22 April 2016 11:07 PM GMT
Next Story