అరెరె… మెగా ఫ్యామిలీకే ఎందుకిలా అవుతోంది..?

ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది అనేది సునీల్ నటించిన సూపర్ హిట్ సినిమాలో పాట. ఇప్పుడీ పాటను మెగా హీరోలంతా మూకుమ్మడిగా పాడుకుంటున్నారు. ఎవరికివారే సోలోగా ఈ సాంగేసుకుంటున్నారు. దీనికి కారణం మెగాఫ్యామిలీని వరుస ఫ్లాపులు వెంటాడటమే. అవును… మెగా కాంపౌండ్ లో ఇప్పుడు ఏ ఒక్క హీరో హ్యాపీగా లేడు. ఎవరు ఏ సినిమా చేసినా ఫ్లాప్ అయి కూర్చుంటోంది. రామ్ చరణ్ చేసిన బ్రూస్ లీ నుంచి కాంపౌండ్ కు కష్టాలు షురూ అయ్యాడు. ఆ తర్వాత వరుణ్ తేజ లోఫర్ గా ఫ్లాప్ తెచ్చుకుంటే… తాజాగా బన్నీ సరైనోడుతో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. వీళ్లిద్దరికీ మధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏకంగా అట్టర్ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. సర్దాగ్ గబ్బర్ సింగ్ సినిమాను మరిచిపోవడానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎలా చూసుకున్నా మెగా కాంపౌండ్ లో హీరోలెవరికీ ఇప్పుడు సక్సెస్ లు లేవు. కేవలం మెగా హీరోలకే ఎందుకిలా అవుతోందంటూ అప్పుడే అభిమానులు లెక్కల్లో మునిగిపోయారు. మరోవైపు ఇలాంటి నెగెటివ్ వైబ్రేషన్స్ మధ్య చిరంజీవి తన 150వ సినిమాకు కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అవుతుంటే… చెర్రీ మరో సినిమా షూటింగ్ లో ఉన్నాడు. 
Click on Image to Read:
chiru
pawan-niharika
boyapati
balakrishna-kajal