Telugu Global
Others

కేసీఆర్ వ్య‌తిరేక కూట‌మికి కాంగ్రెస్ య‌త్నాలు!

పాలేరు ఉప ఎన్నిక ఏక‌గ్రీవానికి అధికార పార్టీ స‌సేమీరా అన‌డంతో కాంగ్రెస్ ప్ర‌తిప‌క్షాల‌ను ఒక్క‌తాటిపై తేవ‌డానికి సిద్ధ‌మైంది. ప్ర‌తిప‌క్షాల‌ను ఈ విష‌యంలో ఏకం చేయ‌డానికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఇప్ప‌టికే ఆయా పార్టీల‌తో మంత‌నాలు ప్రారంభించారు. ఇటీవ‌ల మ‌ర‌ణించిన‌ పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రినో ఒక‌రిని పోటీకి దింపి, ఎన్నిక ఏక‌గ్రీవం చేద్దామ‌నుకున్న కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఈ దిశ‌గా ఉత్త‌మ్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ ప్ర‌య‌త్నంలో ఉత్త‌మ్ తొలి అడుగు […]

కేసీఆర్ వ్య‌తిరేక కూట‌మికి కాంగ్రెస్ య‌త్నాలు!
X
పాలేరు ఉప ఎన్నిక ఏక‌గ్రీవానికి అధికార పార్టీ స‌సేమీరా అన‌డంతో కాంగ్రెస్ ప్ర‌తిప‌క్షాల‌ను ఒక్క‌తాటిపై తేవ‌డానికి సిద్ధ‌మైంది. ప్ర‌తిప‌క్షాల‌ను ఈ విష‌యంలో ఏకం చేయ‌డానికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఇప్ప‌టికే ఆయా పార్టీల‌తో మంత‌నాలు ప్రారంభించారు. ఇటీవ‌ల మ‌ర‌ణించిన‌ పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రినో ఒక‌రిని పోటీకి దింపి, ఎన్నిక ఏక‌గ్రీవం చేద్దామ‌నుకున్న కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఈ దిశ‌గా ఉత్త‌మ్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ ప్ర‌య‌త్నంలో ఉత్త‌మ్ తొలి అడుగు దిగ్విజ‌యంగా వేశారు. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ఈ మేర‌కు జరిపిన చ‌ర్చ‌లు ఫ‌లించాయి. పాలేరులో కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తిచ్చేందుకు జ‌గ‌న్ అంగీకారం తెల‌పడంతో ఉత్త‌మ్ తొలివిజ‌యం సాధించార‌నే చెప్పాలి. ఇక త‌రువాత మిగిలిన‌వి టీడీపీ, సీపీఎంలే!
టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు అంగీక‌రిస్తాడా?
పాలేరు ఉప ఎన్నిక ద్వారా కేసీఆర్‌కు గ‌ట్టి స‌మాధానం చెప్పాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న ఉత్త‌మ్ కుమార్ ప్ర‌య‌త్నాలు క్ర‌మంగా కొలిక్కి వ‌స్తున్న వేళ టీడీపీ మ‌ద్ద‌తు కీల‌కం కానుంది. ఇప్ప‌టికే టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎల్‌. ర‌మ‌ణ‌కు ఉత్త‌మ్ ఫోన్ చేసి మ‌ద్ద‌తు కోరారు. ఆయ‌న సానుకూలంగా స్పందించారు.. టీడీపీ జాతీయాధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబుదే తుది నిర్ణ‌యమ‌ని మెలిక పెట్టారు. ఇక్క‌డ టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉండ‌టం, ఇప్ప‌టికే మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు పేరు ప్ర‌క‌టించ‌డంతో ఉత్త‌మ్ ప్ర‌తిపాద‌న‌కు చంద్ర‌బాబు అంగీక‌రిస్తారా లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక‌పోతే సీపీఎం తెలంగాణ కార్య‌ద‌ర్శి త‌మ్మినేనిని ఉత్తమ్ సంప్ర‌దిస్తే..ఆయ‌న కూడా జాతీయ నాయ‌క‌త్వానిదే తుదినిర్ణ‌య‌మని తేల్చిచెప్పారు. ఏదేమైనా వైసీపీ ఒప్పించ‌డంలో స‌ఫ‌లీకృత‌మైన ఉత్త‌మ్ మిగిలిన ప్ర‌తిప‌క్షాలైన‌ టీడీపీ, సీపీఎంల‌ను కూడా ఒప్పించ‌గ‌ల‌నన్న విశ్వాసంతో ముందుకు వెళుతున్నారు.
First Published:  23 April 2016 3:39 AM GMT
Next Story