Telugu Global
CRIME

ఒకే ఇంట్లో ఉంటున్నాం...రేప్ చేశాడు!

పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి అత్యాచారం చేసిన చిరాగ్ గుప్తా (31) అనే వ్యాపార‌వేత్త‌పై ఓ ముంబయి మోడల్ (25) పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఇటీవ‌ల ఒక పాపుల‌ర్ మ్యూజిక్ వీడియోలో సైతం న‌టించింది. ఢిల్లీకి చెందిన ఆ మోడ‌ల్ మ్యాట్రిమోనియ‌ల్ వెబ్‌సైట్ ద్వారా చిరాగ్ గుప్తాని క‌లిసింది. ఇద్ద‌రూ క‌లిసి గుర్‌గావ్‌లో ఒకే ఇంట్లో ఉంటున్నారు కూడా. ఆ మోడ‌ల్ ఈ విష‌యాల‌ను త‌న ఫిర్యాదులో పేర్కొంది.  అయితే కేసు న‌మోదు చేసిన పోలీసులు చిరాగ్ […]

ఒకే ఇంట్లో ఉంటున్నాం...రేప్ చేశాడు!
X

పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి అత్యాచారం చేసిన చిరాగ్ గుప్తా (31) అనే వ్యాపార‌వేత్త‌పై ఓ ముంబయి మోడల్ (25) పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఇటీవ‌ల ఒక పాపుల‌ర్ మ్యూజిక్ వీడియోలో సైతం న‌టించింది. ఢిల్లీకి చెందిన ఆ మోడ‌ల్ మ్యాట్రిమోనియ‌ల్ వెబ్‌సైట్ ద్వారా చిరాగ్ గుప్తాని క‌లిసింది. ఇద్ద‌రూ క‌లిసి గుర్‌గావ్‌లో ఒకే ఇంట్లో ఉంటున్నారు కూడా. ఆ మోడ‌ల్ ఈ విష‌యాల‌ను త‌న ఫిర్యాదులో పేర్కొంది. అయితే కేసు న‌మోదు చేసిన పోలీసులు చిరాగ్ గుప్తా గురించి విచారించ‌గా, అత‌నికి ఇంత‌కుముందే పెళ్ల‌యింద‌ని తేలింది. అంతేకాదు, 2006లో పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ఒక యువ‌తిపై అత్యాచారం చేశాడ‌ని, అరెస్టుకూడా అయ్యాడ‌ని పోలీసులు కనుగొన్నారు.

First Published:  24 April 2016 4:08 AM GMT
Next Story