Telugu Global
International

ఫేస్ బుక్‌, గూగుల్‌....స‌ముద్రంలో మునుగుతాయా!

సిలికాన్ వాలీ టెక్ దిగ్గ‌జాలు ఫేస్‌బుక్‌, గూగుల్ కార్యాల‌యాల‌కు స‌ముద్రం నుండి ముప్పు పొంచి ఉంద‌ని అమెరికా వాతావ‌ర‌ణ శాఖ‌  ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. భూమిమీద పెరిగిపోతున్న ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా స‌ముద్ర మ‌ట్టం పెరిగే ప్రమాదం ఉంద‌ని, దీనివ‌ల‌న సిలికాన్ వ్యాలీలోని అంత‌ర్జాతీయ టెక్ దిగ్గ‌జాల ప్ర‌ధాన కార్యాల‌యాలకు అల‌ల తాకిడి త‌ప్ప‌ద‌ని వారు చెబుతున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో స‌ముద్ర‌తీర ప్రాంతంలోని ఆస్తులు చాలావ‌ర‌కు స‌ముద్రం పాల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని శాస్త్ర‌వేత్తలు త‌మ తాజా అంచ‌నాలో వెల్ల‌డించారు. శాన్‌ఫ్రాన్సిస్కో లో […]

ఫేస్ బుక్‌, గూగుల్‌....స‌ముద్రంలో మునుగుతాయా!
X

సిలికాన్ వాలీ టెక్ దిగ్గ‌జాలు ఫేస్‌బుక్‌, గూగుల్ కార్యాల‌యాల‌కు స‌ముద్రం నుండి ముప్పు పొంచి ఉంద‌ని అమెరికా వాతావ‌ర‌ణ శాఖ‌ ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. భూమిమీద పెరిగిపోతున్న ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా స‌ముద్ర మ‌ట్టం పెరిగే ప్రమాదం ఉంద‌ని, దీనివ‌ల‌న సిలికాన్ వ్యాలీలోని అంత‌ర్జాతీయ టెక్ దిగ్గ‌జాల ప్ర‌ధాన కార్యాల‌యాలకు అల‌ల తాకిడి త‌ప్ప‌ద‌ని వారు చెబుతున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో స‌ముద్ర‌తీర ప్రాంతంలోని ఆస్తులు చాలావ‌ర‌కు స‌ముద్రం పాల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని శాస్త్ర‌వేత్తలు త‌మ తాజా అంచ‌నాలో వెల్ల‌డించారు.

శాన్‌ఫ్రాన్సిస్కో లో స‌ముద్ర తీరంలో 4ల‌క్ష‌ల30వేల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లంలో తొమ్మిది ఎక‌రాల గార్డెన్ రూఫ్‌టాప్ తో ఉన్న నిర్మాణం ఫేస్‌బుక్ క్యాంప‌స్‌. ఫేస్‌బుక్‌కి స‌ముద్ర ముప్పు మరింత ఎక్కువ‌గా ఉంద‌ని, ఆ ప్ర‌దేశం చాలా దిగువ ప్రాంతంలో ఉంద‌ని కాలిఫోర్నియా తీర ర‌క్ష‌ణ అభివృద్ది క‌మిష‌న్‌లో ప‌నిచేస్తున్న లిండీ లోవే అన్నారు. ఆ ప్ర‌దేశాన్నిత‌మ కార్యాల‌యం కోసం ఎందుకు ఎంపిక చేసుకున్నారో అర్థం కావ‌డం లేద‌ని , అయితే త‌మ ర‌క్ష‌ణ‌కోసం ఎంత‌యినా ఖ‌ర్చుచేసే శ‌క్తి త‌మ‌కుంద‌నే ధీమానే అందుకు కార‌ణం కావ‌చ్చ‌ని లిండీ అభిప్రాయ‌ప‌డ్డారు.

అలాగే స‌ముద్రం ఏ కాస్త ముందుకు వ‌చ్చినా 101 హైవే మీద‌కు వ‌చ్చేసి గూగుల్ ప్లెక్స్‌ని ముంచేస్తుంద‌ని కాలిఫోర్నియా బెర్క్‌లీ యూనివ‌ర్శిటీలో ప‌ట్ట‌ణాల రూప‌క‌ల్ప‌న…ప‌ర్యావ‌ర‌ణ ప్లానింగ్ విభాగంలో ప‌నిచేస్తున్న క్రిస్టినా హిల్ అంటున్నారు. గూగుల్, ఫేస్‌బుక్‌లు త‌మ క్యాంప‌స్‌ల‌కు మార్పులు చేర్పులు చేసుకోవాల‌ని, అయినా అవి ప్ర‌మాదాన్ని త‌ట్టుకుంటాయ‌ని చెప్ప‌లేమ‌ని హిల్ అన్నారు.

First Published:  23 April 2016 11:07 PM GMT
Next Story