Telugu Global
Cinema & Entertainment

నితిన్ సినిమాకు గుమ్మ‌డికాయ కొట్టారు..!

ద‌ర్శ‌కుడు  త్రివిక్ర‌మ్  , నితిన్ కాంబినేష‌న్ లో   అ..ఆ పేరు తో తెర‌కెక్కుతున్న సినిమా  షూటింగ్  పూర్తి చేసుకుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ఈ సమ్మర్ సీజన్‌కు రానున్న సినిమాల్లో ఓ ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇక ఆ క్రేజ్‌ను రెట్టింపు చేసేలా ఉన్న పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.  షూటింగ్ చివరి రోజు …చిత్ర యూనిట్  తో దిగిన ఒక ఫోటోను నితిన్ త‌న  ట్విట‌ర్ […]

నితిన్ సినిమాకు గుమ్మ‌డికాయ కొట్టారు..!
X

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ , నితిన్ కాంబినేష‌న్ లో అ..ఆ పేరు తో తెర‌కెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ఈ సమ్మర్ సీజన్‌కు రానున్న సినిమాల్లో ఓ ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇక ఆ క్రేజ్‌ను రెట్టింపు చేసేలా ఉన్న పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. షూటింగ్ చివరి రోజు …చిత్ర యూనిట్ తో దిగిన ఒక ఫోటోను నితిన్ త‌న ట్విట‌ర్ లో పోస్ట్ చేసి.. స‌మాచారం తెలిపారు.

షూటింగ్ పూర్తి అయ్యింద‌ని ఇక నుంచి ఈ చిత్ర యూనిట్ ను మిస్ అవుతాన‌ని పేర్కొన్నారు. అత్తారింటికి దారేది త‌రువాత ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ చేస్తున్న ఈ చిత్రం స‌కుటుంబ స‌ప‌రివారంగా ఉంటుంద‌ని అ..ఆ సినిమా ప్ర‌చార చిత్రాలు చెబుతున్నాయి. త్రివిక్ర‌మ్ చిత్రమంటే ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు మంచి విందు భోజ‌నం అనే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌నుకోండి. అత్తారింటికి దారేది త‌రువాత వ‌స్తున్న చిత్రం కాబ‌ట్టి ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి మాత్రం బావుంది.

First Published:  24 April 2016 9:01 AM GMT
Next Story