బలపనూరు జగన్‌ వైపా? డబ్బు వైపా?

కడపలో వైఎస్ కుటుంబాన్ని రాజకీయంగా బలహీనపరిచేందుకు దశాబ్దాలుగా టీడీపీ ప్రయత్నిస్తూనే ఉంది.  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కడప జిల్లాలో మాత్రం టీడీపీకి పట్టుదొరడకం లేదు. ఇప్పుడు తాజాగా మరోసారి వైఎస్‌ కుటుంబాన్ని రాజకీయంగా బలహీనపరిచేందుకు టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి దూకేసిన ఆదినారాయణరెడ్డిని ఇందుకు పావుగా వాడుకుంటోంది. ఇటీవల బలపనూరు వైసీపీ సర్పంచ్ రాచమల్లు సరస్వతమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో త్వరలో బలపనూరులో ఉప ఎన్నిక జరగనుంది.  వైఎస్ సొంతూరు అయిన బలపనూరులో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని ఓడిస్తే దాని వల్ల జగన్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని టీడీపీ భావిస్తోంది. సొంతూరులో  పార్టీని గెలిపించుకోలేని జగన్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా గెలుస్తారని ప్రచారం చేయాలన్నది టీడీపీ ఎత్తుగడ. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి ఒక దఫా గ్రామంలో పర్యటించారు.

బెదిరిస్తే బలపనూరులో ఓట్లు రాలవని గ్రహించిన టీడీపీ బృందం ఇప్పుడు డబ్బులతో కొట్టేందుకు సిద్ధమవుతోంతి. గ్రామానికి ఏకంగా కోటిన్నర రూపాయలు మంజూరు చేయాలని సీఎంను ఆదినారాయణరెడ్డి కోరారు. ఇప్పటికే 75లక్షలు మంజూరు చేశారు. ఈ సొమ్ముతో గ్రామస్తులను కాకపట్టేందుకుప్రయత్నిస్తున్నారు. ఇళ్లకు రంగులు వేయించడం, రైతులకు మోటార్లు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆదినారాయణరెడ్డితో పాటు బిటెక్ రవి తదితరులు ఇంటింటి సంబంధాలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆడిగిన వారికి డబ్బులు కూడా పంచిపెడుతున్నారు.

ఇలా అందరిని ఏదో విధంగా మేనేజ్ చేసిన తర్వాత అంతా బాగుంది అనుకున్న తర్వాత సీఎంకు రిపోర్ట్ చేస్తారట. అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారని చెబుతున్నారు. అయితే పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా తిరుగుతున్న ఆదినారాయణరెడ్డిని బలపనూరు గ్రామస్తులు విశ్వసిస్తారా?. టీడీపీ తాత్కాలికంగా చూపుతున్న కాసుల ప్రేమకు పడిపోతారా?.  ఎన్నికలు జరిగితే బలపనూరు జనం జగన్ వైపు ఉన్నారో లేక టీడీపీ వైపు మళ్లారో తేలుతుంది.

Click on Image to Read:

tdp paleru

ysrcp1

ysrcp-mla1

cbn-narasimhan

ysrcp-paderu

bjp-vishnu-kumar-raju

attar-chand-pasha

YS-Jagan1

paritala-sunita-marriages

kodela

ys-jagan-governor

MLA-Jaleel-Khan

ktr-tummala

chiru