Telugu Global
International

కుక్క‌గారికి... తెల్ల‌వార‌లేదు!

కుక్క‌కి విశ్వాసం ఉంటుంద‌ని మ‌న‌కు తెలుసు కానీ, మ‌రీ ఇంత‌గానా అనిపించేలా ఉంది ఈ వీడియో.  ఈ కుక్క‌కి విశ్వాసంతో పాటు కాస్త బ‌ద్ద‌కం కూడా ఎక్కువేన‌ని ఈ వీడియో చెబుతోంది.  ఇంటిల్లిపాదీ నిద్ర‌లేచాక ఆ ఇంటి చిన్న‌కొడుకుని నిద్ర‌లేప‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ అత‌ను క‌ప్పుకున్న దుప్ప‌టిమీద ఎక్కి సుఖంగా నిద్ర‌పోతున్న శున‌క‌రాజాకి ఇది న‌చ్చ‌లేదు. పిల్ల‌వాడిని లేప‌డానికి దుప్ప‌టిని తీస్తున్న‌ప్పుడు అది చూపిస్తున్న కోపం… న‌వ్వు తెప్పించేలా, ఆశ్చ‌ర్యంగా ఉంది. శుక్ర‌వారం పోస్ట‌యిన ఈ వీడియో […]

కుక్క‌గారికి... తెల్ల‌వార‌లేదు!
X

కుక్క‌కి విశ్వాసం ఉంటుంద‌ని మ‌న‌కు తెలుసు కానీ, మ‌రీ ఇంత‌గానా అనిపించేలా ఉంది ఈ వీడియో. ఈ కుక్క‌కి విశ్వాసంతో పాటు కాస్త బ‌ద్ద‌కం కూడా ఎక్కువేన‌ని ఈ వీడియో చెబుతోంది. ఇంటిల్లిపాదీ నిద్ర‌లేచాక ఆ ఇంటి చిన్న‌కొడుకుని నిద్ర‌లేప‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ అత‌ను క‌ప్పుకున్న దుప్ప‌టిమీద ఎక్కి సుఖంగా నిద్ర‌పోతున్న శున‌క‌రాజాకి ఇది న‌చ్చ‌లేదు. పిల్ల‌వాడిని లేప‌డానికి దుప్ప‌టిని తీస్తున్న‌ప్పుడు అది చూపిస్తున్న కోపం… న‌వ్వు తెప్పించేలా, ఆశ్చ‌ర్యంగా ఉంది. శుక్ర‌వారం పోస్ట‌యిన ఈ వీడియో ఇప్ప‌టికే 2కోట్ల 60 ల‌క్ష‌ల వ్యూస్ సంపాదించింది. మీరూ చూడండి.

https://youtu.be/wQFfATp8sj0

First Published:  23 April 2016 10:08 PM GMT
Next Story