Telugu Global
National

మ‌రో మ‌హాకుంభ‌మేళా...ఐదుకోట్ల‌మంది యాత్రికులు!

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినీలో ఈ నెల 22వ తేదీ నుండి వ‌చ్చేనెల 21 వ‌ర‌కు సింహ‌స్థ కుంభ మ‌హాప‌ర్వ మేళా జ‌రుగుతుంది. ప్ర‌తి ప‌న్నెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి చాలా పెద్ద సంఖ్య‌లో భ‌క్తుల‌తో పాటు సాధువులు యోగులు హాజ‌ర‌వుతారు.   ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే సాధువులు త‌మ ప్ర‌త్యేక ఆహార్యంతో విభిన్నంగా క‌న‌బ‌డుతుంటారు. ఈ భూమ్మీద జరిగే నాలుగు అతిపెద్ద కుంభ‌మేళాల‌లో ఇదీ ఒక‌టి. భ‌క్తులు క్షిప్రా న‌దిలో స్నానం చేసి మ‌హాకాళేశ్వ‌ర ఆల‌యంలో పూజ‌లు […]

మ‌రో మ‌హాకుంభ‌మేళా...ఐదుకోట్ల‌మంది యాత్రికులు!
X

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినీలో ఈ నెల 22వ తేదీ నుండి వ‌చ్చేనెల 21 వ‌ర‌కు సింహ‌స్థ కుంభ మ‌హాప‌ర్వ మేళా జ‌రుగుతుంది. ప్ర‌తి ప‌న్నెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి చాలా పెద్ద సంఖ్య‌లో భ‌క్తుల‌తో పాటు సాధువులు యోగులు హాజ‌ర‌వుతారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే సాధువులు త‌మ ప్ర‌త్యేక ఆహార్యంతో విభిన్నంగా క‌న‌బ‌డుతుంటారు. ఈ భూమ్మీద జరిగే నాలుగు అతిపెద్ద కుంభ‌మేళాల‌లో ఇదీ ఒక‌టి. భ‌క్తులు క్షిప్రా న‌దిలో స్నానం చేసి మ‌హాకాళేశ్వ‌ర ఆల‌యంలో పూజ‌లు చేస్తారు. మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ కుంభ‌మేళా కోసం అన్నిర‌కాల ఏర్పాట్లతో పాటు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లుకూడా చేసింది. కుంభ‌మేళా ప్రారంభ‌మైన శుక్ర‌వారం రోజే ప‌దిల‌క్ష‌ల‌మంది భ‌క్తులు న‌దిలోస్నానం చేశారు. అందులో 1.25 ల‌క్ష‌ల మంది సాధువులే ఉన్నార‌ని అంచ‌నా. ఈ కుంభ‌మేళా ఖ‌ర్చు 5వేల కోట్ల రూపాయ‌లు. దీనికోసం 362 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు, రోడ్లు నిర్మించారు. 450 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిని శాశ్వ‌తంగా ఉండేలా ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌ల‌ను అందుబాటులో ఉంచారు. 30 కిలోమీట‌ర్ల వ‌ర‌కు చూడ‌గ‌ల డిజిట‌ల్ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐదుకోట్ల‌మంది యాత్రికులు వ‌స్తార‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది.

First Published:  23 April 2016 11:43 PM GMT
Next Story