Telugu Global
Cinema & Entertainment

చైతూ నుంచి ఈ ఏడాది 3 సినిమాలు

ఒక్కోసారి సడెన్ గా ఖాళీ అయిపోతాడు నాగచైతన్య. మరోసారి ఒకేసారి చకచకా సినిమాలు విడుదల చేస్తుంటాడు. ప్రస్తుతం చైతూకు టైం వచ్చింది. కుదిరితే ఈ ఏడాది 3 సినిమాలు రిలీజ్ చేయాలని నాగచైతన్య భావిస్తున్నాడు. ఇందులో 2 సినిమాలు ఇప్పటికే సెట్స్ పై ఉన్నాయి. ఒక సినిమాను తాజాగా ప్రారంభించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో సినిమా చేశాడు చైతూ. ఈ మూవీని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. చైతూ నుంచి ఈ ఏడాది రాబోతున్న […]

చైతూ నుంచి ఈ ఏడాది 3 సినిమాలు
X
ఒక్కోసారి సడెన్ గా ఖాళీ అయిపోతాడు నాగచైతన్య. మరోసారి ఒకేసారి చకచకా సినిమాలు విడుదల చేస్తుంటాడు. ప్రస్తుతం చైతూకు టైం వచ్చింది. కుదిరితే ఈ ఏడాది 3 సినిమాలు రిలీజ్ చేయాలని నాగచైతన్య భావిస్తున్నాడు. ఇందులో 2 సినిమాలు ఇప్పటికే సెట్స్ పై ఉన్నాయి. ఒక సినిమాను తాజాగా ప్రారంభించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో సినిమా చేశాడు చైతూ. ఈ మూవీని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. చైతూ నుంచి ఈ ఏడాది రాబోతున్న మొదటి సినిమా ఇది.
చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమాకు రీమేక్ ఇది. హీరోయిన్లు ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాను కూడా ఇదే ఏడాది విడుదల చేస్తారట. చైతూ నుంచి రాబోతున్న రెండో సినిమా ఇది. ఇక ముచ్చటగా మూడో సినిమాను కూడా ఈమధ్యే ప్రారంభించాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్న కల్యాణ్ కృష్ణ… తన రెండో ప్రయత్నంగా చైతూతో సినిమా షురూ చేశాడు. ఈ మూవీ అన్నపూర్ణ స్టుడియోస్ లో ప్రారంభమైంది. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభించి… డిసెంబర్ లో విడుదల చేస్తారట. సో… చైతూ నుంచి రాబోతున్న మూడో సినిమా ఇది.
First Published:  24 April 2016 12:29 AM GMT
Next Story