Telugu Global
CRIME

సినిమా తీశాడు...ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు!

నాలుగు కోట్లు పెట్టి సినిమా తీశాడు. ప్రివ్యూ వేసుకుని చూశాడు. ఏమైందో కానీ తెల్ల‌వారేస‌రికి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. కేర‌ళ‌, తిరుముల్ల‌వ‌రంకి చెందిన ఒక యువ నిర్మాత అర్థంత‌రంగా జీవితాన్ని చాలించాడు. శ‌నివారం రాత్రి త‌న ఇంట్లోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. అజ‌య్ కృష్ణ‌న్ (29) టివి సీరియ‌ల్స్‌లో సినిమాల్లో న‌టిస్తుంటాడు. అవ‌రుడే రావుక‌ల్ అనే సినిమా తీశాడు. దాని తాలూకూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే ఆత్మ‌హ‌త్య‌కు ఒక రోజు ముందు ఎర్నాకులంలో సినిమా ప్రివ్యూ చూశాడు. […]

సినిమా తీశాడు...ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు!
X

producerనాలుగు కోట్లు పెట్టి సినిమా తీశాడు. ప్రివ్యూ వేసుకుని చూశాడు. ఏమైందో కానీ తెల్ల‌వారేస‌రికి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. కేర‌ళ‌, తిరుముల్ల‌వ‌రంకి చెందిన ఒక యువ నిర్మాత అర్థంత‌రంగా జీవితాన్ని చాలించాడు. శ‌నివారం రాత్రి త‌న ఇంట్లోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. అజ‌య్ కృష్ణ‌న్ (29) టివి సీరియ‌ల్స్‌లో సినిమాల్లో న‌టిస్తుంటాడు. అవ‌రుడే రావుక‌ల్ అనే సినిమా తీశాడు. దాని తాలూకూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే ఆత్మ‌హ‌త్య‌కు ఒక రోజు ముందు ఎర్నాకులంలో సినిమా ప్రివ్యూ చూశాడు. త‌రువాత ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సినిమా బాగా రాలేద‌నే భ‌యంతో, డిప్రెష‌న్‌కి గుర‌యి ఆత్మ‌హ‌త్య‌చేసుకుని ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. అసిఫ్ ఆలీ. ఉన్ని ముకుంద‌న్‌ల‌తో తీసిన సినిమాకు అజ‌య్, నాలుగు కోట్లు ఖ‌ర్చుపెట్టాడు. శ‌నివారం ఏడువ‌ర‌కు మామూలుగా త‌ల్లిదండ్రుల‌తో స్నేహితునితో మాట్లాడిన అజ‌య్ కృష్ణ‌న్, ఏడున్న‌ర‌కు త‌న బెడ్‌రూములో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఆసుప‌త్రికి తీసుకువెళ్లే స‌రికే మ‌ర‌ణించాడు. అజ‌య్ కృష్ణ‌న్‌కి త‌ల్లిదండ్రులు, విదేశాల్లో ఉన్న సోద‌రి ఉన్నారు. అత‌ను ఇంజినీరింగ్ చ‌దివాడు.

First Published:  25 April 2016 2:38 AM GMT
Next Story