జగన్‌ Vs బాబు గారి జర్నలిస్టులు

పట్టపగలు ప్రజాస్వామ్యం చేత ఆర్తనాదాలు చేయిస్తూ  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలకు పచ్చ కండువా కప్పేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ది అదే దారి. కానీ ఆయన నాలుగు గోడల మధ్య చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం తన మీడియా దండు సాక్షిగా కండువాలు కప్పి ఇది నా బలం అంటూ రాజ్యాంగానికే సవాల్ విసురుతున్నారు. బాబు రాజకీయనాయకుడు కాబట్టి ఆయన నుంచి అంతకు మించి పెద్దగా ఆశించడం కూడా తప్పే. కానీ విచిత్రం ఏమిటంటే బాబు చేసే ఫిరాయింపు రాజకీయం  ఒక వర్గం మీడియాకు, అందులో పనిచేసే చంద్రబాబు అభిమాన జర్నలిస్టులకు రంభతో కలిసి నాట్యమాడినంత ఆనందంగా ఉండడమే .

సాధారణంగా అయితే  రాజ్యాంగం గొంతు కోస్తూ ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు తీరును మీడియా ప్రశ్నించాలి. కానీ బాబు జర్నలిస్టులు మాత్రం అలా చేయడం లేదు. ఏ చర్చా కార్యక్రమంలోనైనా సోకాల్డ్ జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. జగన్ వ్యవహార శైలి బాగోలేదట కదా… అందుకే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారట కదా అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కట్టుకున్న మొగుడు ఉండగా విడాకులు ఇవ్వకుండానే మరొకరి దగ్గర పడుకునేందుకు సిగ్గులేదా అని మాత్రం ఫిరాయించిన ఎమ్మెల్యేలను గానీ, వారితో కాపురం చేస్తున్న వారిని గానీ నిలదీయరు. సరే జగన్‌ చెడ్డవాడు కాబట్టే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారని అనుకుందాం. మరి ఫిరాయింపుదారులు నీతివంతుతే అయితే  స్వచ్చమైన శీలంతో బతుకుతున్న వారే అయితే విడాకులు ఇచ్చి మరొకరి పడక పంచుకోవాలి కదా!. మెడలో బంగారు తాళి మాత్రం పాత మొగుడిది కావాలి… పడక సుఖం మాత్రం పక్కింటివాడికి ఇవ్వాలి ఇదేక్కడి రాజనీతి? అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రులను కాకుండా బాధితులుగా మారిన ప్రతిపక్షాలనే తప్పుపట్టడం బహుశా ప్రపంచ మీడియా చరిత్రలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు విపక్షాలు విలవిల అంటూ పంచ్‌ డైలాగులు రాయడం ఒకటి. ముఖ్యమంత్రి చర్యలకు విలవిలలాడుతున్న ప్రతిపక్షాలు కాదు ప్రజాస్వామ్యం అన్నది వారికి కూడా తెలుసు. కానీ బాబు గారు ఏం చేసినా అది మీడియాకు అద్భుతంగా కనిపిస్తుంది. జర్నలిస్టులు తన సంస్థ ఆదేశాలు, అవసరాల కోసం పనిచేయక తప్పదు. అంతవరకు  జర్నలిస్టులు బాబుకు డబ్బా కొడితే తప్పులేదు. కానీ తామే టీడీపీ అధికార ప్రతినిధులమైనట్టుగా బాబు పరిరక్షణకు అత్యుత్సాహం చూపడమే తెలుగు జర్నలిజం చేసుకున్న దౌర్భాగ్యం.

Click on Image to Read:

mp-siva-prasad-1

ravela-susheel-kumar

botsa

bhuma-jyotula

roja1

ysrcp-mlas

jyotula-pawan

ysrcp1

ys-jagan1

kamineni

sunny

BUDDA-RAJASHEKAR-REDDY1

tdp paleru

ysrcp-mla1

cbn-narasimhan

YS-Jagan1