Telugu Global
National

ఒక్క‌ రూపాయి ఇప్పుడు...9, 999 రూ. త‌రువాత‌!

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల అధికారుల‌కు అక్క‌డి అభ్య‌ర్థులు చుక్క‌లు చూపిస్తున్నారు. ఇంత‌కుముందు ఒక స్వ‌తంత్ర్య అభ్య‌ర్థి ప‌దివేల రూపాయ‌ల డిపాజిట్ మొత్తాన్ని ప‌దిరూపాయ‌ల నాణేల రూపంలో ఇస్తే, ఇప్పుడు మ‌రొక అభ్య‌ర్థి ముందు ఒక రూపాయి ఇస్తా…గ‌డువు ముగిసే రోజున 9,999రూపాయ‌లు చెల్లిస్తానంటూ వారి స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు. మే 16న జ‌ర‌గ‌నున్న సేలం ఉత్త‌ర నియోజ‌క వ‌ర్గానికి పోటీచేసేందుకు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డానికి రెవెన్యూ డివిజిన‌ల్ ఆఫీసుకి పేప‌ర్లతో వెళ్లాడు అబ్దుల్ వాహిద్. డిపాజిట్‌గా చెల్లించాల్సిన మొత్తంలో […]

ఒక్క‌ రూపాయి ఇప్పుడు...9, 999 రూ. త‌రువాత‌!
X

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల అధికారుల‌కు అక్క‌డి అభ్య‌ర్థులు చుక్క‌లు చూపిస్తున్నారు. ఇంత‌కుముందు ఒక స్వ‌తంత్ర్య అభ్య‌ర్థి ప‌దివేల రూపాయ‌ల డిపాజిట్ మొత్తాన్ని ప‌దిరూపాయ‌ల నాణేల రూపంలో ఇస్తే, ఇప్పుడు మ‌రొక అభ్య‌ర్థి ముందు ఒక రూపాయి ఇస్తా…గ‌డువు ముగిసే రోజున 9,999రూపాయ‌లు చెల్లిస్తానంటూ వారి స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు. మే 16న జ‌ర‌గ‌నున్న సేలం ఉత్త‌ర నియోజ‌క వ‌ర్గానికి పోటీచేసేందుకు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డానికి రెవెన్యూ డివిజిన‌ల్ ఆఫీసుకి పేప‌ర్లతో వెళ్లాడు అబ్దుల్ వాహిద్. డిపాజిట్‌గా చెల్లించాల్సిన మొత్తంలో ఒక్క రూపాయి మాత్ర‌మే ఇప్పుడు చెల్లిస్తా…గ‌డువు ఈ నెల 29 వ‌ర‌కు ఉంది క‌నుక, ఆ రోజున మిగిలిన 9,999రూ.లు క‌డ‌తానంటూ మొండికేశాడు.

అక్క‌డ ఉన్నరిట‌ర్నింగ్ అధికారి, ఇత‌ర సిబ్బంది, అలా కుద‌ర‌దు అంటూ ఎంత‌గా న‌చ్చచెప్పినా విన‌లేదు. అంత‌కుముందు అత‌ను పూర్తిగా నింప‌ని నామినేష‌న్ పేప‌ర్ల‌ను తీసుకువ‌చ్చి వాటిని తీసుకోవాల్సిందిగా అధికారుల‌ను బ‌ల‌వంత‌పెట్టాడు. అంతేకాదు, అక్క‌డే కూర్చుని ధ‌ర్నా మొద‌లుపెట్టాడు. ఆ విష‌యంమీద న‌చ్చ‌చెప్పాక‌, రూపాయి గొడ‌వ మొద‌లుపెట్టాడు. మ‌రోసారి ధ‌ర్నాకి కూర్చున్నాడు. అలా ఈ గొడ‌వ సాయంత్రం నాలుగుగంట‌ల వ‌ర‌కు సాగింది. అధికారులు పూర్తి డిపాజిట్ డ‌బ్బు క‌ట్ట‌నిదే, పేప‌ర్లు పూర్తిగా నింప‌నిదే తీసుకోబోమ‌ని వాహిద్‌కి చాలా గ‌ట్టిగా చెప్పాక అత‌ను వెనుదిరిగాడు. అయితే వాహిద్ బ‌య‌ట‌కు వ‌చ్చాక విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ, ఎన్నిక‌ల అధికారులు, సిబ్బంది చురుగ్గా, అప్ర‌మ‌త్తంగా త‌మ విధుల‌ను నిర్వర్తించ‌డం లేద‌ని, వారిలోని నిస్తేజాన్ని వ‌ద‌ల‌గొట్ట‌డానికే తానీ ప‌నిచేశాన‌ని తెలిపాడు.

First Published:  26 April 2016 4:02 AM GMT
Next Story