చావుబతుకుల్లో దావూద్ ఇబ్రహీం

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ముంబై పేలుళ్ల ద్వారా వందల మందిని పొట్టన పెట్టుకున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చావుకు దగ్గరలో ఉన్నారు.  దావూద్‌కు జబ్బు ముదిరిందని ఆయన బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు వైద్యులు తేల్చారని సీఎన్ఎన్ న్యూస్ 18 కథనం. దావూద్ ఇబ్రహీం కాళ్లలో గ్యాంగ్రీన్‌( శరీరం కుళ్లిపోవడం)తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.  చికిత్స చేస్తున్న వైద్యులు కూడా గ్యాంగ్రీన్ చివరిదశలో ఉన్నట్టు తేల్చారు. కరాచీలోని లియాఖత్ జాతీయ ఆస్పత్రిలో అతనికి సైనిక ఆస్పత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారు

అధిక రక్తపోటు, మధుమేహం వల్ల దావూద్ కాళ్లకు రక్తసరఫరాలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయని, కాళ్లకు ఆక్సిజన్ అందక  కణజాలం కుళ్లిపోతోందని వైద్యులు తేల్చారు. గ్యాంగ్రీన్ వల్ల ఉత్పత్తయ్యే విషపదార్థాలు శరీరమంతా కూడా వ్యాపించే అవకాశముందంటున్నారు. రెండు కాళ్లను తొలగించడం తప్ప ప్రస్తుతానికి మరో దారి లేదని వైద్యులు చెబుతున్నారు. రెండు కాళ్లు తీసివేసినా జబ్బు ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు. పరిస్థితి విషమించడంతో దావూద్ ఎక్కువ రోజులు బతకడం సాధ్యం కాకపోవచ్చని వైద్యులు తేల్చేసినట్టు తెలుస్తోంది.

Click on Image to Read:

9898989898989

kcr-balakrishna

mega-family

talasani-kcr

bhuma-jyotula

ysrcp-mlas

roja1

babu-jagan

botsa

jyotula-pawan

mp-siva-prasad-1

uma-bharathi

pawan-namitha

ysrcp1

ys-jagan1

sunny

YS-Jagan1