స‌ల్మాన్‌కి వ్య‌తిరేకంగా ఐశ్వ‌ర్యా రాయ్ పిటీష‌న్!

రియో ఒలింపిక్స్‌లో మ‌న‌దేశం త‌ర‌పున పాల్గొనే క్రీడాకారుల‌కు గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌ని ఎంపిక చేయ‌డంపై ఐశ్వ‌ర్యా రాయ్ త‌న విముఖత వ్యక్తం చేసింది. దీనిపై ఆమె ఛేంజ్.ఆర్గ్‌లో  ఆన్‌లైన్ పిటీష‌న్‌ని పోస్ట్ చేసింది….అయితే… కంగారు ప‌డ‌కండి ఈ పిటీష‌న్‌ని వేసిన మ‌హిళ బాలివుడ్ న‌టి ఐశ్వ‌ర్యా రాయా లేక అదే పేరుతో ఉన్న‌మ‌రొక మ‌హిళా అన్న‌ది తేల‌లేదు. 

ఈ పిటీష‌న్‌లో ఐశ్వ‌ర్యారాయ్ అనే ఆ మ‌హిళ స‌ల్మాన్ ఖాన్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసింది. స‌ల్మాన్‌ఖాన్‌కు మ‌హిళ‌ల‌ను హింసించిన చ‌రిత్ర ఉంద‌ని, అంతేకాక అత‌నిపై కృష్ణ‌జింక‌ని వేటాడిన కేసు, మ‌ద్యం సేవించి కారుని మ‌నుషుల‌మీద ఎక్కించి పారిపోయిన కేసు ఉన్నాయ‌ని, అలాంటి వ్య‌క్తిని భార‌త్ త‌ర‌పున ఒలింపిక్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించ‌డం సిగ్గుచేట‌ని ఆమె పేర్కొన్నారు. స‌ల్మాన్‌ఖాన్‌కి అలాంటి గౌర‌వ హోదాని క‌ట్ట‌బెట్ట‌డం భార‌త్ కి అవమాన‌క‌రంగా మారుతుంద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డింది. అయితే ఈ పిటీష‌న్‌పై ఇంత‌వ‌ర‌కు 348 మంది మాత్ర‌మే అనుకూలంగా స్పందించారు. ఈ విష‌యంలో స‌ల్మాన్‌కి వ్య‌తిరేకంగా పోస్ట‌యిన మొద‌టి పిటీష‌న్ ఐశ్వ‌ర్యారాయ్ అనే పేరుతో ఉన్న‌దే.