Telugu Global
WOMEN

ఇదేం రూలు...ఒక త‌ల్లికి గుండెని పిండేసే బాధ మిగిల్చారు!

మ‌నుషుల‌కోసం పెట్టుకున్న నియమాలు, నిబంధ‌న‌లు ఆ మ‌నుషుల‌కే ప‌నికిరాని సంద‌ర్భాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఓ త‌ల్లి తన ఫేస్ బుక్ ద్వారా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేల‌మంది త‌ల్లులు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచారు. వివ‌రాల్లోకి వెళితే-  జెస్సికా కోక్‌లే మార్టిన్ అనే మ‌హిళ,  లండ‌న్‌, హెత్‌రో ఎయిర్‌పోర్టు ఏవియేష‌న్ సెక్యురిటీ విభాగానికి త‌న ఫేస్‌బుక్ ద్వారా ఈ బ‌హిరంగ లేఖ రాసింది. త‌న బాబుకోసం, కొన్నిరోజుల‌పాటు త‌న‌ పాల‌ను పిండి సీసాలో భ‌ద్ర‌ప‌రుచుకున్న […]

ఇదేం రూలు...ఒక త‌ల్లికి గుండెని పిండేసే బాధ మిగిల్చారు!
X

మ‌నుషుల‌కోసం పెట్టుకున్న నియమాలు, నిబంధ‌న‌లు ఆ మ‌నుషుల‌కే ప‌నికిరాని సంద‌ర్భాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఓ త‌ల్లి తన ఫేస్ బుక్ ద్వారా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేల‌మంది త‌ల్లులు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచారు. వివ‌రాల్లోకి వెళితే-

జెస్సికా కోక్‌లే మార్టిన్ అనే మ‌హిళ, లండ‌న్‌, హెత్‌రో ఎయిర్‌పోర్టు ఏవియేష‌న్ సెక్యురిటీ విభాగానికి త‌న ఫేస్‌బుక్ ద్వారా ఈ బ‌హిరంగ లేఖ రాసింది. త‌న బాబుకోసం, కొన్నిరోజుల‌పాటు త‌న‌ పాల‌ను పిండి సీసాలో భ‌ద్ర‌ప‌రుచుకున్న ఆమె, ఎయిర్‌పోర్టులో సెక్యురిటీ అధికారుల బ‌ల‌వంతంమీద ఆ సీసాను ఎలా వ‌దిలేయాల్సివ‌చ్చిందో …అందులో రాసింది. మార్టిన్ ఒక ఉద్యోగిని. ఆమె నెల‌లో 15 రోజులు ప్ర‌యాణాలు చేస్తూ ఉంటుంది. త‌న‌కు ఎనిమిది నెల‌ల బాబున్నాడు. ఇంట్లో ఉండ‌ని స‌మ‌యాల్లోనూ, త‌న పాలు బాబుకి అందాల‌నే తాప‌త్ర‌యంతో ఆమె త‌న బ్రెస్ట్ మిల్క్‌ని బాటిల్‌లోకి తీసి నిల‌వ చేస్తూ ఉంటుంది. తాను ఇంట్లో ఉండ‌ని స‌మ‌యాల్లో ఆ పాలు బాబుకి ఆహారంగా ప‌నికొస్తుంటాయి. త‌న బిడ్డ‌కు త‌ల్లిపాల కొర‌త రాకూడ‌ద‌నే నిశ్చ‌యంలో ఆమె అంత శ్ర‌మ‌ప‌డుతోంది. పాల‌ను తీయ‌డానికి త‌న‌కు ఏకాంతం కావాలి కాబ‌ట్టి, వివిధ ప్ర‌దేశాల్లో రెస్ట్ రూముల్లో, బాత్‌రూముల్లో ఈ ప‌నిచేస్తూ ఉంటుంది.

ఒక త‌ల్లికి ఇలాంటి అవ‌స‌రం ఉండ‌వ‌చ్చు…అలాంటి మ‌హిళ‌ల‌కోసం వ‌స‌తులు క‌ల్పిద్దామ‌నే ఆలోచన ఎవ‌రికీ, ఎక్క‌డా ఉండ‌దు క‌నుక ఆమె అత్యంత శ్ర‌మ‌కోర్చి బిడ్డ‌కోసం పాల‌ను నిల్వ‌చేస్తూ వ‌స్తోంది. ఆ బాటిల్‌తో ఆమె ప్ర‌యాణం చేస్తూ ఉండ‌గా ఎయిర్‌పోర్టు సెక్యురిటీ అధికారులు కుదర‌ద‌న్నారు. పాల‌ను ఆమె గ‌డ్డ‌క‌ట్టిన స్థితిలో తీసుకువెళుతోంది. కానీ దాన్ని తీసుకువెళ్లే వీలులేద‌ని ఎయిర్‌పోర్టు అధికారులు బ‌ల‌వంత‌పెట్ట‌డంతో ఆమె ఆ పాల బాటిల్ని వ‌దిలేయాల్సి వ‌చ్చింది.

ఎయిర్‌పోర్టు సెక్యురిటీ త‌న‌ని ఒక ఉద్యోగినిగా, ఒక త‌ల్లిగా ఓడిపోయ‌లా చేశార‌ని, ఈసారి ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే..వారు కాస్త మ‌న‌సుపెట్టి ఆలోచించాల‌ని ఆమె కోరింది. తాను వారిని బ్ర‌తిమ‌లాడ‌టానికి, అది ఏ ల‌గ్జ‌రీ సెంటు బాటిలో, ఖ‌రీదై వైను బాటిలో కాద‌ని, కొన్నిగంట‌ల త‌న శ్ర‌మ‌, త‌న శ‌క్తి, త‌న బిడ్డ పోష‌కాహారం, త‌న గౌర‌వాన్ని మ‌ర‌చి, బ‌య‌టి ప్ర‌దేశాల్లో ఏకాంతాన్ని వెతుక్కుని బిడ్డ కోసం పాల‌ను సేక‌రించిన త‌న మాన‌సిక వేద‌న…మొత్తంగా రెండువారాల పాటు త‌న బిడ్డ క‌డుపు నింప‌గ‌ల, ఆ చిన్నారి నోటిద‌గ్గ‌ర ఆహారం….అంటూ ఆ త‌ల్లి వాపోయింది.

First Published:  27 April 2016 12:35 AM GMT
Next Story