Telugu Global
Cinema & Entertainment

న్యూయార్క్ లో బాలయ్య పాటల కంపోజింగ్

బాలకృష్ణ వందో సినిమా పని ప్రారంభించినట్టు ఇప్పటికే ప్రకటించాడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. దాదాపు 15 రోజులుగా ఇదే పని మీద ఉన్నాడు. మరీ ముఖ్యంగా బాలయ్య వందో సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ను న్యూయార్క్ లో చేయడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ ప్రకటించాడు. న్యూయార్ లో బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు బాలయ్య కసరత్తులు చేస్తూ ఒళ్లు తగ్గించే పనిలో పడ్డాడు. […]

న్యూయార్క్ లో బాలయ్య పాటల కంపోజింగ్
X

బాలకృష్ణ వందో సినిమా పని ప్రారంభించినట్టు ఇప్పటికే ప్రకటించాడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. దాదాపు 15 రోజులుగా ఇదే పని మీద ఉన్నాడు. మరీ ముఖ్యంగా బాలయ్య వందో సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ను న్యూయార్క్ లో చేయడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ ప్రకటించాడు. న్యూయార్ లో బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు బాలయ్య కసరత్తులు చేస్తూ ఒళ్లు తగ్గించే పనిలో పడ్డాడు. ఇంకోవైపు దర్శకుడు క్రిష్ లొకేషన్ల వేటలో పడ్డాడు. మొరాకోలో ఈ సినిమా షూటింగ్ జరపాలని నిర్ణయించింది. ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ ఓ కొలిక్కి రాగానే వచ్చే నెలలో మొదటి షెడ్యూల్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ను ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు.

First Published:  27 April 2016 12:41 AM GMT
Next Story