Telugu Global
Cinema & Entertainment

ఈ ఏడాది బాలయ్య... వచ్చే ఏడాది చిరంజీవి

ఒకప్పటి యుద్ధం మళ్లీ మొదలుకాబోతోంది. అలనాటి బాక్సాఫీస్ వార్ మళ్లీ షురూకానుంది. ఇలా సినీవిశ్లేషకులు చాలా లెక్కలు వేసుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ షార్ట్ గ్యాప్ లో సినిమాలు స్టార్ట్ చేయడంతో… ఒకప్పటి పోటీకి మళ్లీ తెరలేచిందని భావించారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే బాలకృష్ణ ఈ మధ్యే వందో మూవీగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను స్టార్ట్ చేస్తే…. చిరంజీవి ఈనెల 29న తన 150వ సినిమాను ప్రారంభిస్తున్నాడు. సో…. థియేటర్లలోకి రెండు సినిమాలు షార్ట్ గ్యాప్ లో […]

ఈ ఏడాది బాలయ్య... వచ్చే ఏడాది చిరంజీవి
X

ఒకప్పటి యుద్ధం మళ్లీ మొదలుకాబోతోంది. అలనాటి బాక్సాఫీస్ వార్ మళ్లీ షురూకానుంది. ఇలా సినీవిశ్లేషకులు చాలా లెక్కలు వేసుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ షార్ట్ గ్యాప్ లో సినిమాలు స్టార్ట్ చేయడంతో… ఒకప్పటి పోటీకి మళ్లీ తెరలేచిందని భావించారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే బాలకృష్ణ ఈ మధ్యే వందో మూవీగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను స్టార్ట్ చేస్తే…. చిరంజీవి ఈనెల 29న తన 150వ సినిమాను ప్రారంభిస్తున్నాడు. సో…. థియేటర్లలోకి రెండు సినిమాలు షార్ట్ గ్యాప్ లో వస్తాయని, ఒకేరోజు విడుదలై పోటీకి తెరతీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చాలామంది భావించారు. కానీ బాలయ్య, చిరు మాత్రం ఒకప్పటి బాక్సాఫీస్ పోరుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఒకరి సినిమా హిట్టవ్వాలని మరొకరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందుకే సినిమాల విడుదల విషయంలో లాంగ్ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం…. బాలయ్య చేస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణ మూవీ ఈ ఏడాదిలోనే విడుదలవుతుంది. కానీ చిరంజీవి 150వ సినిమా మాత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తుంది. సో… ఈసారి ఈ ఇద్దరు బడా హీరోల మధ్య బాక్సాఫీస్ సమరం లేనట్టే.

First Published:  27 April 2016 12:41 AM GMT
Next Story