బాబుకు, వైసీపీ ఎమ్మెల్యేలకు మైసూరా మీడియేటరా?

మైసూరారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరు నెలలుగా మైసూరారెడ్డి ఏం చేశారో తమకు తెలుసన్నారు. ఆరు నెలలుగా వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తూ టీడీపీలోకి వెళ్లాలని నూరిపోశారని ఆరోపించారు.  ఆరు నెలల్లో చాలా మంది ఎమ్మెల్యేలకు మైసూరారెడ్డి ఫోన్లు చేశారని పెద్దిరెడ్డి అన్నారు.  జగన్‌ను డబ్బు మనిషి అని మైసూరా ఎలా అంటారని ప్రశ్నించారు. మైసూరారెడ్డిని జగన్‌ ఏమైనా డబ్బులు అడిగారా? అని మైసూరారెడ్డిని నిలదీశారు. జగన్ సీనియర్లను గౌరవించకపోతే తాము కూడా పార్టీ వీడేవారిమి కదా అని అన్నారు. రాయలసీమ కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన మైసూరారెడ్డి మూడు సార్లు ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు.

మైసూరారెడ్డి తన సిమెంట్ కంపెనీ లీజు కోసమే మైసూరారెడ్డి టీడీపీలో చేరుతున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.  సిమెంట్ కంపెనీ కోసం బ్యాంకులో లోన్ మంజూరుకు చంద్రబాబు హామీ ఇచ్చారని అందుకే మైసూరా వైసీపీకి రాజీనామా చేశారని విమర్శించారు. తమ్ముడి కుమారుడిని జమ్మలమడుగు వైసీపీ ఇన్‌చార్జ్‌గా నియమించడాన్ని మైసూరా తట్టుకోలేకపోతున్నారని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. పదేపదే పార్టీలు మారే మైసూరారెడ్డే ఒక అపరిచితుడు అని అన్నారు.

Click on Image to Read:

peddireddy

ys-jagan

ts tdp

laxminarayana

mysura-reddy

vijayasair-reddy

jagan-shart-pawar

lokanadam

Gade-Venkata-Reddy

sakshi-directors

manchu-vishnu

gottipati

YS-Jagan-Save-Democracy

cbn

YS-Jagan-Delhi-tour

babu

VH

karam

achury

9898989898989