అనసూయ పాత్రలో టబు

తెలుగులో క్షణం సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ లో పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమా లాభాల పంట పండించింది. అడవి శేషును మరోసారి లైమ్ లైట్ లోకి తీసుకురావడంతో పాటు అనసూయ కెరీర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. అన్నింటికీ మించి పీవీపీని మంచి అభిరుచి కలిగిన నిర్మాతగా నిలబెట్టింది. తెలుగులో సంచలనం సృష్టించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారు. హిందీ ఆడియన్స్ కు తగ్గట్టు దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు సమచారం. మరోవైపు ఈ సినిమాలో అనసూయ పోషించిన పాత్రను హిందీలో టబు పోషించనుంది. టబు అయితే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇంకోవైపు సత్యం రాజేష్ పోషించిన పాత్రను హిందీలో నవజుద్దీన్ సిద్ధిఖి పోషించనున్నాడు. అయితే అడవి శేషు పోషించిన పాత్రను ఎవరు చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. విదేశాల్లో సెటిలై… ఇండియాకొచ్చే యువకుడి పాత్ర అది. ఆ క్యారెక్టర్ కోసం ఇప్పటికే జాన్ అబ్రహాం,రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్ లాంటి పేర్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా హిందీ రీమేక్ పై ఓ అధికారిక ప్రకటన రానుంది.