ఊహించని గిఫ్ట్ అందుకున్న సమంత…

 ఈ ఫొటో చూస్తే సమంతకు వచ్చిన బహుమతి ఎలాంటిదో ఎవరైనా గుర్తుపట్టేస్తారు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ అందమైన గిఫ్ట్ అందుకుంది సమంత. ఆ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. ఇదిగో ఇలా గిఫ్ట్ బాక్స్ లోంచి చిన్న బాబు ఎలా బయటకొచ్చాడో చూడండి. ఆ ఫొటోనే తను పోస్ట్ చేసింది. ఈ పుట్టినరోజుకు ఆశ్చర్యకరమైన బహుమతి అందుకున్నానని  ట్వీట్ చేసింది. సమంత ఈ ఫొటో పెట్టినప్పటి నుంచి ఆ బాబు ఎవరై ఉంటాడా అని అంతా ఆరాలు తీశారు. పైగా సమంతకు 24 గంటల ముందే అడ్వాన్స్ గా గిఫ్ట్ అందించింది ఎవరా అని ఆలోచించారు. అయితే అది నీరజ కోన చేసి మేజిక్ అని తర్వాత తెలిసింది. సమంతకు వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న నీరజ కోన… తన అబ్బాయినే ఇలా గిఫ్ట్ బాక్స్ లో పెట్టి పుట్టినరోజు కానుక ఇస్తున్నట్టు ఫొటో తీసిందట. ఆ ఫొటోనే సమంత తన ట్విట్టర్ పేజీలో పెట్టింది. ఈ రోజు సమంత పుట్టినరోజు. తెలుగులో ఆమె నితిన్ సరసన అ…ఆ సినిమా చేస్తోంది. అటు మహేష్ తో బ్రహ్మోత్సవం… ఎన్టీఆర్ తో జనతా గ్యారేజీ సినిమాల్లో కూడా నటిస్తోంది. మరి ఈ 3 సినిమాల్లో ఏ సినిమా సెట్స్ లో సమంత తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకుంటుందో చూడాలి.