Telugu Global
National

ఐటి ప‌రిశ్ర‌మ‌లో ఫ్రెష‌ర్లకు జీతాలు పెర‌గ‌టం లేదు!

  ఇంజినీరింగ్ పూర్తి చేసి ఐటి ఉద్యోగాల్లోకి ఉత్సాహంగా వ‌స్తున్న గ్రాడ్యుయేట్ల‌కు ప‌రిస్థితి అంత ఆశాజ‌నకంగా లేద‌ని తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరిగిన‌ట్టుగా వారి ప్రారంభ జీతాల్లో పెరుగుద‌ల క‌నిపించ‌డం లేదు.  160 బిలియ‌న్ డాలర్ల భార‌త ఐటి ప‌రిశ్ర‌మ ఫ్రెష‌ర్లకు ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేద‌ని, ఇప్పుడు తాజాగా డిగ్రీ తీసుకుని జాబ్‌లోకి వ‌చ్చేవారికి ప్రారంభ వేత‌నంగా ద‌శాబ్దంనాటి వేత‌నాలే ఉన్నాయ‌ని  ప్ర‌ముఖ టెక్ కంపెనీల హెచ్ ఆర్ హెడ్స్ చెబుతున్నారు. టిసిఎస్, ఇన్ఫోసిస్‌, విప్రో త‌దిత‌ర […]

ఇంజినీరింగ్ పూర్తి చేసి ఐటి ఉద్యోగాల్లోకి ఉత్సాహంగా వ‌స్తున్న గ్రాడ్యుయేట్ల‌కు ప‌రిస్థితి అంత ఆశాజ‌నకంగా లేద‌ని తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరిగిన‌ట్టుగా వారి ప్రారంభ జీతాల్లో పెరుగుద‌ల క‌నిపించ‌డం లేదు. 160 బిలియ‌న్ డాలర్ల భార‌త ఐటి ప‌రిశ్ర‌మ ఫ్రెష‌ర్లకు ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేద‌ని, ఇప్పుడు తాజాగా డిగ్రీ తీసుకుని జాబ్‌లోకి వ‌చ్చేవారికి ప్రారంభ వేత‌నంగా ద‌శాబ్దంనాటి వేత‌నాలే ఉన్నాయ‌ని ప్ర‌ముఖ టెక్ కంపెనీల హెచ్ ఆర్ హెడ్స్ చెబుతున్నారు. టిసిఎస్, ఇన్ఫోసిస్‌, విప్రో త‌దిత‌ర కంపెనీల హెచ్ ఆర్ అధికారులు వెల్ల‌డిస్తున్న డేటాని బ‌ట్టి, ఐటి దిగ్గ‌జ కంపెనీలు, కొత్త‌గా కెరీర్‌లోకి వ‌స్తున్న‌వారికి జీతాలు పెంచ‌డం ప‌ట్ల ఏ మాత్రం ఆస‌క్తిని క‌న‌బ‌డ‌ర‌ర‌చ‌డం లేద‌ని , త‌మ క‌స్ట‌మ‌ర్లు సిటిగ్రూపు, జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్ లాంటి అమెరికా మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలు న‌ష్టాల్లో ఉన్న నేప‌థ్యంలో, అవి త‌మ గ‌త మార్జిన్ల‌ను కాపాడుకోవ‌డానికీ, పెరుగుతున్న ధ‌ర‌ల‌ను, క‌రెన్సీ మార్పుల‌ను స‌రిచూసుకోవ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తున్నాయ‌ని తెలుస్తోంది. అవ‌కాశాల‌కంటే ఏటా ఇంజ‌నీరింగ్ పూర్తిచేసి బ‌య‌ట‌కు వ‌స్తున్న‌వారి సంఖ్య హెచ్చుగా ఉండ‌టం వ‌ల్ల‌నే ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని నాస్కామ్ సర్వే వెల్లడించింది. కాలేజీల్లోంచి ఉత్తీర్ణులై బ‌య‌ట‌కు వ‌స్తున్న ప్ర‌తి ఐదుమంది ఇంజనీర్లకు ఒక్కటే జాబ్ అందుబాటులో ఉంటున్న‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.

First Published:  28 April 2016 2:00 AM GMT
Next Story