Telugu Global
CRIME

బాలింత‌...ఎనిమిదో అంత‌స్తు నుండి కింద‌ప‌డింది!

బెంగలూరు, ఎల‌న‌హ‌ళ్లిలో  ఓ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆరురోజుల క్రితం బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన చంద‌నా న‌గేష్ (26)ఎనిమిదో అంత‌స్తులో ఉన్న త‌మ ఫ్లాట్ నుండి కింద‌ప‌డి మ‌ర‌ణించింది. అప్పుడే త‌ల‌స్నానం చేసిన చంద‌న త‌మ బెడ్‌రూములో త‌ల ఆర‌బెట్టుకుంటూ గ్లాస్ విండో నుండి తొంగిచూస్తూ కింద‌ప‌డిపోయింది. ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న చంద‌న మెట‌ర్న‌టీ లీవులో ఉంది. ఆ స‌మ‌యంలో ఆమె త‌ల్లి, అత్త‌గారు బాబు వ‌ద్ద ఉన్నారు. ఎనిమిదో అంత‌స్తునుండి చంద‌న కింద‌ప‌డుతూ […]

బాలింత‌...ఎనిమిదో అంత‌స్తు నుండి కింద‌ప‌డింది!
X

బెంగలూరు, ఎల‌న‌హ‌ళ్లిలో ఓ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆరురోజుల క్రితం బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన చంద‌నా న‌గేష్ (26)ఎనిమిదో అంత‌స్తులో ఉన్న త‌మ ఫ్లాట్ నుండి కింద‌ప‌డి మ‌ర‌ణించింది. అప్పుడే త‌ల‌స్నానం చేసిన చంద‌న త‌మ బెడ్‌రూములో త‌ల ఆర‌బెట్టుకుంటూ గ్లాస్ విండో నుండి తొంగిచూస్తూ కింద‌ప‌డిపోయింది. ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న చంద‌న మెట‌ర్న‌టీ లీవులో ఉంది. ఆ స‌మ‌యంలో ఆమె త‌ల్లి, అత్త‌గారు బాబు వ‌ద్ద ఉన్నారు.

ఎనిమిదో అంత‌స్తునుండి చంద‌న కింద‌ప‌డుతూ పెట్టిన కేక సెక్యురిటీ గార్డుకి పెద్ద‌గా వినిపించింది. అత‌ను ప‌రిగెత్తుకు వ‌చ్చేస‌రికే చంద‌న ర‌క్త‌పు మ‌డుగులో ఉంది. గార్డులు, చందన ఏ ఫ్లోర్‌నుండి ప‌డిపోయిందో తెలుసుకునేందుకు ప‌రుగులు తీస్తుండ‌గానే ఆమె త‌ర‌పువారు కింద‌కు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చారు. ఆసుపత్రికి త‌ర‌లించేలోపునే చంద‌న‌ మ‌ర‌ణించింది. మంగ‌ళ‌వారం సాయంత్రం ఆమె మ‌ర‌ణించ‌గా వైద్యులు బుధ‌వారం పోస్ట్ మార్ట‌మ్ చేసి బాడీని కుటుంబానికి అప్ప‌గించారు. పోలీసులు అస‌హ‌జ‌మ‌ర‌ణంగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. చంద‌న భ‌ర్త అభిలాష్ సైతం సాఫ్ట్‌వేర్ ఇంజినీరే.

First Published:  27 April 2016 11:43 PM GMT
Next Story