జేసీ ఇంత దిగజారారా?… బాబు కాళ్ల వద్ద రెడ్ల పరువు తాకట్టు

మాట మాట్లాడితే మా రెడ్లు బాగుండాలి. మా రెడ్లు రాజ్యమేలాలి అని చెప్పే జేసీ చివరకు చంద్రబాబు ముందు మొకరిల్లారు. ఆయనతో  పాటు రెడ్లలందరినీ బాబుకు బహిరంగ సభ సాక్షిగా తాకట్టు  పెట్టేశారు. శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించిన వేళ ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన  జేసీ… చంద్రబాబును విపరీతంగా పొగిడేశారు.

దశబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతేనా ఇలా మాట్లాడుతున్నది అన్నట్టుగా ప్రశంగించారు.  చంద్రబాబు దయ వల్ల రెండేళ్లలో రాయలసీమ.. కోనసీమను తలదన్నేలా తయారవుతుందన్నాను.  రెండేళ్ల తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలను తలదన్నేలా సీమ అభివృధ్ది ఉంటుందన్నారు. అంతటితో ఆగితే ఆయనేదో బాబుగారి మీద ప్రేమతో పొడిగేశారు అనుకోవచ్చు. కానీ రెడ్ల ప్రస్తావన తెచ్చారు.

”సార్ మా పేరు చివర తోకలు చూసి అనుమానం పడకండి. మేమంతా మీ వెంటే ఉంటాం. మా రెడ్డీస్ అంతా మీకు సపోర్టు చేస్తాం. ధైర్యంగా ముందుకెళ్లండి” అని చెప్పుకొచ్చారు. రెడ్లంతా ఏకగ్రీవంగా మద్దతు ఇస్తున్నామని  రెడ్లందరికీ తానే ప్రతినిధి అయినట్టు చెప్పారు.   బుడ్డా రాజశేఖర్ పేరు చివర కూడా రెడ్డి అనే తోక ఉందని ఆయన కూడా పార్టీలో చేరారని దాన్ని చూసైనా తమను నమ్మాలని వేడుకున్నారు జేసీ. జగన్ వెంట చివరకు మిగిలేది విజయమ్మ ఒక్కతే అని చెప్పారు .

Click on Image to Read:

ysr-mysura-reddy

ys-jagan

laxminarayana

peddireddy

vijayasair-reddy

mysura

kamasutra

mysura-reddy

ts tdp

jagan-shart-pawar

lokanadam

Gade-Venkata-Reddy