బ‌రువుని త‌గ్గించే మాయాజాలం….మ‌సాలా!

మ‌న ఆహారంలో రుచిని ఘాటుని పెంచే మ‌సాలాలు చాలా ఉన్నాయి. వీటివ‌ల‌న రుచే కాదు, ఆరోగ్యమూ పెరుగుతుంది. ఆ వివ‌రాలు ఇవి-

  • దాల్చిన చెక్క శ‌రీరంలో షుగ‌ర్‌స్థాయిని స‌మ‌తుల్యంలో ఉంచుతుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌ను వేగ‌వంతం చేస్తుంది. కొవ్వుని క‌రిగిస్తుంది.
  • అల్లం శ‌రీరంలో అద‌నంగా ఉన్న కొవ్వుని త‌గ్గిస్తుంది.  విషాల‌ను తొల‌గిస్తుంది. త‌ద్వారా శ‌రీర బ‌రువు త‌గ్గేందుకు దోహ‌దం చేస్తుంది.
  • యాలకులు కూడా కొవ్వుని క‌రిగించి బ‌రువుని త‌గ్గిస్తాయి.
  • ప‌సుపు కొవ్వు క‌ణాల ఉత్ప‌త్తిని త‌గ్గించి శ‌రీరం బ‌రువు పెర‌గ‌కుండా నివారిస్తుంది.
  • మిర‌ప‌కాయ‌ల్లో ఉన్న క్యాప్స‌కిన్ అనే ప‌దార్థం కొవ్వు పెర‌గ‌కుండా చేస్తుంది. త్వ‌ర‌గా ఆక‌లివేయ‌టం అనే స‌మ‌స్య‌ని నివారిస్తుంది.
  • జీల‌క‌ర్ర జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ని ఆరోగ్య‌వంతంగా ఉంచుతుంది. శ‌రీరం నుంచి వృథాలు. విషాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. దాంతో బ‌రువు అదుపులో ఉంటుంది.
  • న‌ల్ల మిరియాలు మెట‌బాలిజం రేటుని పెంచుతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను శుభ్రం చేస్తాయి…తద్వారా బ‌రువుని అదుపులో ఉంచుతాయి.
  • అవిసె గింజ‌లతో త‌యారైన స్నాక్స్ తీసుకుంటే పొట్ట నిండుగా ఉన్న‌ట్టుగా ఉంటుంది.
  • గోరుచిక్కుడు శ‌రీరంలో షుగ‌ర్ స్థాయిని త‌గ్గిస్తాయి. జీర్ణ‌క్రియ‌ని వేగ‌వంతం చేస్తాయి.
  • మెంతిపొడి మెట‌బాలిజం రేటుని పెంచి శ‌రీరం బ‌రువుని త‌గ్గిస్తుంది.
  • సోపు గింజ‌లు అరుగుద‌ల‌కు ప‌నిచేస్తాయి. వీటివాస‌న ఒత్తిడిని త‌గ్గిస్తుంది.