మానవీయ కోణం… బార్‌ నుంచి సిమెంట్ కంపెనీ వరకూ…

మైసూరారెడ్డి వైసీపీని వీడారు. మానవీయ కోణంలోనే జగన్‌కు సాయం చేసేందుకు వైసీపీలో చేరానని మైసూరారెడ్డి చెప్పారు. బ్రేక్‌ ఫాస్ట్‌కు ఇంటికి పిలిచి కండువా వేశారని తనకు ఆలోచించుకునే అవకాశంకూడా ఇవ్వలేదని మైసూరారెడ్డి చెబుతున్నారు. అయితే ఇందుకు కౌంటర్‌గా అన్నట్టు గతంలో మైసూరారెడ్డి కుమారుడు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మధ్య జరిగిన ఒక సంఘటన వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా,  మైసూరారెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో మైసూరారెడ్డి కుమారుడు ఒకసారి వైఎస్‌ వద్దకు వెళ్లారట. వైఎస్‌కు ఒక చీటి ఇచ్చి ఇది మా నాన్న మీకు ఇవ్వమన్నారని మైసూరారెడ్డి కుమారుడు చెప్పారు. అందులో ఒక బార్‌ అండ్ రెస్టారెంట్‌కు అనుమతి ఇప్పించాలని రాసి ఉందని చెబుతున్నారు. దాన్ని చదివిన వైఎస్‌ వెంటనే దాన్ని  చించి పక్కనే డస్ట్ బిన్‌లో వేశారట. ”మీ నాన్న గురించి నాకు తెలుసు.. మైసురా స్థాయి ఏంటో కూడా నాకు తెలుసు.ఇలాంటి చిన్నచిన్న వాటితో పరువు తీయవద్దు. మీ నాన్నకు తగ్గస్థాయిలో ఏదైనా ప్రతిపాదన సిద్ధం చేసుకుని రండి పరిశీలిద్దాం” అని  వైఎస్  చెప్పారట.

అలా వైఎస్ ఇచ్చిన హామీతోనే కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య సంబంధీకుల నుంచి రఘురాం సిమెంట్‌ మైసూరా కుటుంబం చేతికి వచ్చిందని చెబుతుంటారు. అయితే సిమెంట్ కంపెనీ అనుమతులు పూర్తిగా రాకముందే వైఎస్ చనిపోవడంతో ఆ పక్రియ మధ్యలో ఆగిపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు సిమెంట్ కంపెనీని సొంతూరు నిడిజువ్వి సమీపంలో ఏర్పాటు చేయాలని మైసూరారెడ్డి అనుకుంటున్నారు.అయితే మైనింగ్ ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ భూములు ఉండడం, రైల్వే ట్రాక్ కోసం ప్రభుత్వ భూమి అవసరం ఉండడం వంటి కారణాలతోనే మైసూరా రెడ్డి మళ్లీ టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధపడ్డారని చెబుతున్నారు.

Click on Image to Read:

JC-Waste

ys-jagan

laxminarayana

peddireddy

vijayasair-reddy

mysura

kamasutra

mysura-reddy

ts tdp

jagan-shart-pawar

lokanadam

Gade-Venkata-Reddy