రాక్షసులకు విష్ణుమూర్తి… చంద్రబాబుకు జగన్

చంద్రబాబు నాడు ఎన్టీఆర్‌ ను నేడు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన … ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలను చూసి  ఓటేసిన జనమే సిగ్గుపడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవడం చేతగాని కుమారుడు పప్పును సీఎం చేసేందుకే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎన్టీఆర్‌, కేసీఆర్, చంద్రబాబులను కూడా ఎమ్మెల్యేలు వదలివెళ్లారని అంటే వారంతా అసమర్థులంటే చంద్రబాబు ఒప్పుకుంటారా అని నిలదీశారు.  రాక్షసులకు విష్ణుమూర్తిని చూస్తే భయమని.. అలాగే చంద్రబాబుకు జగన్ అంటే భయంపట్టుకుందని రోజా అన్నారు.

చంద్రబాబు అవినీతిపై ఢిల్లీలో పుస్తకాలు పంచితే ఏపీ బ్రాండ్ దెబ్బతింటుందని వాపోతున్న టీడీపీ నేతలు గతంలో వైఎస్‌కు వ్యతిరేకంగా పుస్తకాలు పంచలేదా అని ప్రశ్నించారు. జగన్ సమర్ధుడు కాబ్టటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాడని … చంద్రబాబు మాత్రం మోదీ, పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకుని అధికారంలోకి వచ్చారన్నారు. ఎమ్మెల్యేలను కొనడం లేదని  కాణిపాకం వినాయకుడి ముందు ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని టీడీపీలోకి రావడం లేదని భార్యపిల్లల మీద చంద్రబాబు ప్రమాణం చేస్తారా అని రోజా అన్నారు. నాడు వైస్రాయ్ హోటల్‌ వేదికగా ఎమ్మెల్యేలను కొన్నారని ఇప్పుడు అక్రమ కట్టడం లింగమనేని భవన్ లో ఎమ్మెల్యేలను కొంటున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబు బుద్ది అప్పటికీ ఇప్పటికీ మారలేదన్నారు.

Click on Image to Read:

ysr-mysura-reddy

ys-jagan

laxminarayana

peddireddy

vijayasair-reddy

mysura

kamasutra

mysura-reddy

ts tdp

jagan-shart-pawar

lokanadam

Gade-Venkata-Reddy