Telugu Global
Cinema & Entertainment

అన్ని విషయాల్లో ఓ కొలిక్కి వచ్చిన బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం సినిమా ఆడియో ఫంక్షన్ కు సంబంధించిన కన్ఫ్యూజన్ అంతా ఇంతా కాదు. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ పై కన్ఫ్యూజన్ కొనసాగింది. ఫైనల్ గా ఆ తేదీతో పాటు సినిమా షూటింగ్, సినిమా విడుదల లాంటి మరెన్నో అంశాలపై బ్రహ్మోత్సవం టీం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ఆడియోను తిరుపతిలో కాకుండా హైదరాబాద్ లోనే నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మే 7న హైదరాబాద్ లోని హెచ్ ఐ సీ సీలో […]

బ్రహ్మోత్సవం సినిమా ఆడియో ఫంక్షన్ కు సంబంధించిన కన్ఫ్యూజన్ అంతా ఇంతా కాదు. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ పై కన్ఫ్యూజన్ కొనసాగింది. ఫైనల్ గా ఆ తేదీతో పాటు సినిమా షూటింగ్, సినిమా విడుదల లాంటి మరెన్నో అంశాలపై బ్రహ్మోత్సవం టీం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ఆడియోను తిరుపతిలో కాకుండా హైదరాబాద్ లోనే నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మే 7న హైదరాబాద్ లోని హెచ్ ఐ సీ సీలో బ్రహ్మోత్సవం పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అయితే ఇన్నాళ్లూ ఎదురుచూసిన తిరుపతి ప్రజలు డిసప్పాయింట్ అవ్వకూడదనే ఉద్దేశంతో… సినిమా విడుదలకు ముందు ఓ చిన్న ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఇక హైదరాబాద్ లో జరిగే ఆడియో ఫంక్షన్ కు సూపర్ స్టార్ కృష్ణతో పాటు… నాగార్జున, వెంకటేష్ ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. మహేష్ తో పాటు వీళ్లంతా ఒకే వేదికపై కనిపించనున్నారన్నమాట. ఇక సినిమా అప్ డేట్స్ విషయానికొస్తే…. కేవలం కొన్ని సన్నివేశాలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ మిగిలిన సన్నివేశాల్ని కూడా రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. మూవీని మే 27న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.
First Published:  28 April 2016 10:01 PM GMT
Next Story