Telugu Global
Cinema & Entertainment

కొత్త అవతారంలో నయన తార‌

ఏ సెక్ట‌ర్ లో అయిన కొంద‌రు కెర‌టాలాంటి వాళ్లుంటారు. ప‌డిన ప్ర‌తి సారి  మ‌రింత వేగంగా  లేస్తారు.   ఈ కేట‌గిరికి చెందిన  వారిలో  ద‌క్షిణాది  నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్  న‌య‌న‌తార   ఒక‌రు. న‌టిగా త‌న ప్ర‌స్థానం   తెలుగు నాటే మంచి  స‌క్సెస్  వ‌చ్చింది. ల‌క్ష్మీ  చిత్రంతో  న‌య‌న‌తార  ఆడియ‌న్స్ కు బాగా రీచ్ అయ్యింది.  దాంతో  స్టార్  హీరోలంద‌రు ఆమేతో  క‌ల‌సి న‌టించ‌డానికి  ఆస‌క్తి చూపారు. తెలుగులో న‌య‌న చేసిన చిత్రాల్లో 80 ప‌ర్సెంట్ స‌క్స‌స్ రేషి […]

కొత్త అవతారంలో నయన తార‌
X

ఏ సెక్ట‌ర్ లో అయిన కొంద‌రు కెర‌టాలాంటి వాళ్లుంటారు. ప‌డిన ప్ర‌తి సారి మ‌రింత వేగంగా లేస్తారు. ఈ కేట‌గిరికి చెందిన వారిలో ద‌క్షిణాది నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ న‌య‌న‌తార ఒక‌రు. న‌టిగా త‌న ప్ర‌స్థానం తెలుగు నాటే మంచి స‌క్సెస్ వ‌చ్చింది. ల‌క్ష్మీ చిత్రంతో న‌య‌న‌తార ఆడియ‌న్స్ కు బాగా రీచ్ అయ్యింది. దాంతో స్టార్ హీరోలంద‌రు ఆమేతో క‌ల‌సి న‌టించ‌డానికి ఆస‌క్తి చూపారు. తెలుగులో న‌య‌న చేసిన చిత్రాల్లో 80 ప‌ర్సెంట్ స‌క్స‌స్ రేషి యో ఉంది. అదే ఊపు కోలీవుడ్ లో చూపింది.

ఇక్క‌డ కాస్త కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతున్న స‌మ‌యంలో కోలీవుడ్ కు వెళ్లి అక్క‌డ వ‌ర‌స చిత్రాలు చేసి నెంబ‌ర్ వ‌న్ కు రీచ్ అయ్యింది. క‌ట్ చేస్తే ప్ర‌స్తుతం న‌య‌న‌తార ఒక లాంగ్వేజ్ హీరోయిన్ కాదు. సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా హ‌ల్ చ‌ల్ చేస్తుంది. శింబు తో చేసిన ఒక చిత్రం .. అలాగే ఉద‌య నిధి స్టాలిన్ తో చేసిన మ‌రో చిత్రం అక్క‌డ రిలీజ్ కు ఉన్నాయి. తెలుగులో వెంక‌టేష్ స‌ర‌స‌న బాబు బంగారం చిత్రం చేస్తుంది. అయితే ఇంత బిజీగా ఉన్నప్పటికీ నయనతార మనస్సు ఇప్పుడు సినిమా నిర్మాణరంగం వైపు లాగుతున్నదని సమాచారం. దర్శకుడు విఘ్నేష్ శివ‌న్ చెప్పిన కథ విన్న తరువాత ఆ సినిమాలో నటించడంతో పాటు తనే నిర్మిస్తానని చెప్పిందట నయనతార. మేలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో అధికారికంగా తెలుస్తాయి…

First Published:  29 April 2016 3:41 AM GMT
Next Story