Telugu Global
Others

పాలేరుకు పెద్ద‌పాలేరు న‌వుతా: తుమ్మ‌ల‌

పాలేరుకు పెద్ద‌పాలేరున‌వుతాన‌ని మంత్రి తుమ్మ‌ల హామీ ఇచ్చారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌కు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు శుక్ర‌వారం నామినేష‌న్ దాఖ‌లుచేశారు. నామినేష‌న్ దాఖ‌లు చేసేముందు ఏర్పాటు చేసిన స‌భ‌లో తుమ్మ‌ల ఆవేశంగా ప్ర‌సంగించారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. త‌న‌ను గెలిపిస్తే.. మునుపెన్న‌డూ చూడ‌ని అభివృద్ధిని చూపెడ‌తాన‌ని హామీ ఇచ్చారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి పెద‌పాలేరును అవుతాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. తాను గెలిచాక 3 నెలల్లో భ‌క్త‌రామ‌దాసు నీళ్లు, 3 ఏళ్ల‌లో ఇంటింటికీ తాగునీరు […]

పాలేరుకు పెద్ద‌పాలేరు న‌వుతా: తుమ్మ‌ల‌
X

పాలేరుకు పెద్ద‌పాలేరున‌వుతాన‌ని మంత్రి తుమ్మ‌ల హామీ ఇచ్చారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌కు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు శుక్ర‌వారం నామినేష‌న్ దాఖ‌లుచేశారు. నామినేష‌న్ దాఖ‌లు చేసేముందు ఏర్పాటు చేసిన స‌భ‌లో తుమ్మ‌ల ఆవేశంగా ప్ర‌సంగించారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. త‌న‌ను గెలిపిస్తే.. మునుపెన్న‌డూ చూడ‌ని అభివృద్ధిని చూపెడ‌తాన‌ని హామీ ఇచ్చారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి పెద‌పాలేరును అవుతాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. తాను గెలిచాక 3 నెలల్లో భ‌క్త‌రామ‌దాసు నీళ్లు, 3 ఏళ్ల‌లో ఇంటింటికీ తాగునీరు అందించ‌క‌పోతే… జీవితంలో ఇక నాముఖం మీకు చూపించ‌న‌ని శ‌ప‌థం చేశారు. యావ‌త్ తెలంగాణ ఈ ఎన్నిక వైపు చూస్తోంద‌ని, న్యాయంవైపు చూసి ఓటేయాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. త‌రువాత మంత్రి కేటీఆర్ కూడా తుమ్మ‌ల వంటి నాయ‌కుడిని గెలిపించుకోవాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అనంత‌రం కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నామినేష‌న్ గ‌డువు ముగియ‌నుంది. చివ‌రిరోజు పైగా ముహూర్తం బాగుండ‌టంతో నాయుడిపెట నుంచి మంత్రి తుమ్మ‌ల భారీ ర్యాలీగా త‌న అనుచ‌రులు మరియు మంత్రి కేటీఆర్ వెంట‌రాగా త‌న నామినేష‌న్‌ని రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌కు స‌మ‌ర్పించారు.

First Published:  29 April 2016 2:32 AM GMT
Next Story