”అలా చేస్తే ఒక్క రూపాయి కూడా రాదు”… మాల్యా కొత్త హెచ్చరిక

తొమ్మిది వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ డాన్ విజయ్‌ మాల్యా మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు.  తనను ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలవడంతో మాల్యా కొత్త స్లోగన్ అందుకున్నారు.  తనను అరెస్ట్ చేస్తే ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు రాదంటూ లండన్‌ నుంచే స్టేట్‌మెంట్ ఇచ్చారు.  తాను ఇంగ్లండ్ వదలి వచ్చే ప్రసక్తే లేదని కూడా తేల్చిచెప్పారు.  పాస్‌పోర్ట్ రద్దు చేయడం,  అరెస్ట్ చేయడం వంటివన్నీ వృధా ప్రయాసలేనని తేల్చేశారు మాల్యా.

అంతే కాదు బ్యాంకులకు మరో ఆఫర్ కూడా ఇచ్చారాయన.  తాను అంతో ఇంతో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని దాన్ని తీసుకుని సరిపెట్టుకోవాలని బ్యాంకులపై దయ చూపించారు. మాల్యాను ఇండియాకు అప్పగించాలని ఇప్పటికే ఇంగ్లండ్ ప్రభుత్వానికి భారత్ లేఖ కూడా రాసింది. పాస్ పోర్టు రద్దు చేసింది. ఈ  ఒత్తిడి నేపధ్యంలో మాల్యా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

Click on Image to Read:

galla-jayadev

rayapati

kakinada comissioner

murali-mohan

ntr-bhavan

konatala

ys-jagan

tdp-mlas

JC

lokesh

roji-1

ysr-mysura-reddy

ys-jagan

laxminarayana

peddireddy

vijayasair-reddy

mysura

kamasutra

jagan-shart-pawar