Telugu Global
NEWS

నా వ‌ల్ల కావ‌డం లేదు... అంతా నా దురదృష్టం

ఇటీవ‌ల వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్న క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ త‌న ఆట‌తీరుపై ఆవేదన చెందారు. అంతా త‌న దుర‌దృష్ట‌మ‌ని వాపోయారు. ఐపీఎల్ ఎందుకో త‌న‌కు క‌లిసి రావ‌డం లేద‌ని చెప్పారు. వ‌న్డేల్లో దూకుడుగా ఆడిన తాను ఐపీఎల్ మాత్రం ఆ దూకుడును ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నాన‌ని అన్నారు. ప‌దేప‌దే టీఎంలు మారాల్సి రావ‌డం కూడా ఐపీఎల్‌లో రాణించ‌లేక‌పోవ‌డానికి ఒక కార‌ణంగా యూవీ విశ్లేషించుకున్నారు. 2008-10 మధ్య పంజాబ్ జట్టు తరపున, 2011-13 మధ్య పూణే తరపున, 2014లో బెంగళూరు తరపున, 2015లో […]

నా వ‌ల్ల కావ‌డం లేదు... అంతా నా దురదృష్టం
X

ఇటీవ‌ల వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్న క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ త‌న ఆట‌తీరుపై ఆవేదన చెందారు. అంతా త‌న దుర‌దృష్ట‌మ‌ని వాపోయారు. ఐపీఎల్ ఎందుకో త‌న‌కు క‌లిసి రావ‌డం లేద‌ని చెప్పారు. వ‌న్డేల్లో దూకుడుగా ఆడిన తాను ఐపీఎల్ మాత్రం ఆ దూకుడును ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నాన‌ని అన్నారు. ప‌దేప‌దే టీఎంలు మారాల్సి రావ‌డం కూడా ఐపీఎల్‌లో రాణించ‌లేక‌పోవ‌డానికి ఒక కార‌ణంగా యూవీ విశ్లేషించుకున్నారు. 2008-10 మధ్య పంజాబ్ జట్టు తరపున, 2011-13 మధ్య పూణే తరపున, 2014లో బెంగళూరు తరపున, 2015లో ఢిల్లీ తరపున, ప్రస్తుతం హైదరాబాద్ తరపున ఇలా టీంలు మారడం రాణించకపోవడానికి కారణమన్నాడు. టి20 వల్డ్‌కప్ మ్యాచ్‌ల సమయంలో గాయపడ్డ యువరాజ్ ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆడలేకపోయాడు. త్వరలోనే తిరిగి జ‌ట్టులోకి వ‌స్తాన‌ని యూవీ ధీమా వ్య‌క్తం చేశారు.

First Published:  30 April 2016 8:55 AM GMT
Next Story