Telugu Global
Others

పొంగులేటి వైసీపీని వీడుతారా?

ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి గులాబీ పార్టీలో చేరుతార‌న్న ప్ర‌చారం మ‌రోసారి రేగింది. ఇది తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రోసారి చ‌ర్చానీయాంశ‌మైంది. పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తోపాటు మ‌రో ఎమ్మెల్యే పాయంవెంక‌టేశ్వ‌ర్లు (పిన‌పాక‌)తో క‌లిసి గులాబీ కండువాలు క‌ప్పుకోనున్నారంటూ ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త క‌ల‌క‌లం రేపుతోంది. ఏప్రిల్ 27న ఖ‌మ్మం జిల్లాలో జ‌రిగిన ప్లీన‌రీ సంద‌ర్భంగానే ఎంపీ పొంగులేటి సీఎం స‌మ‌క్షంలో కారెక్కుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, దానిపై త‌క్ష‌ణ‌మే స్పందించిన పొంగులేటి విలేక‌రుల […]

పొంగులేటి వైసీపీని వీడుతారా?
X
ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి గులాబీ పార్టీలో చేరుతార‌న్న ప్ర‌చారం మ‌రోసారి రేగింది. ఇది తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రోసారి చ‌ర్చానీయాంశ‌మైంది. పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తోపాటు మ‌రో ఎమ్మెల్యే పాయంవెంక‌టేశ్వ‌ర్లు (పిన‌పాక‌)తో క‌లిసి గులాబీ కండువాలు క‌ప్పుకోనున్నారంటూ ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త క‌ల‌క‌లం రేపుతోంది. ఏప్రిల్ 27న ఖ‌మ్మం జిల్లాలో జ‌రిగిన ప్లీన‌రీ సంద‌ర్భంగానే ఎంపీ పొంగులేటి సీఎం స‌మ‌క్షంలో కారెక్కుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, దానిపై త‌క్ష‌ణ‌మే స్పందించిన పొంగులేటి విలేక‌రుల స‌మావేశం పెట్టి ఖండించారు. తాజాగా మ‌రోసారి లాంటి వార్త‌లే రావ‌డం తెలంగాణ‌లో వైసీపీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. నిజంగా వీరిద్ద‌రూ గులాబీపార్టీలో చేరితే ఇక వైసీపీ ఖాళీ అయిన‌ట్లే లెక్క‌!
పాలేరు, పాల‌మూరే కార‌ణ‌మా?
తెలంగాణ బిల్లుకు ముందే జ‌గ‌న్ పార్టీ తెలంగాణ నుంచి తాము త‌ప్ప‌కుంటున్నామ‌ని చెప్ప‌డంతో కొండా సురేఖ లాంటి బ‌ల‌మైన నేత‌లు త‌మ దారి తాము చూసుకున్నారు. అయినా ఖ‌మ్మం జిల్లా నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఎంపీగా గెలిచారు. మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు తాటి వెంక‌టేశ్వ‌ర్లు (అశ్వ‌రావుపేట‌), బానోత్ మ‌ద‌న్ లాల్ (వైరా), పాయంవెంక‌టేశ్వ‌ర్లు (పిన‌పాక‌) విజ‌యం సాధించారు. అయితే వీరిలో తాటి వెంక‌టేశ్వ‌ర్లు (అశ్వ‌రావుపేట‌), బానోత్ మ‌ద‌న్ లాల్ (వైరా) గులాబీ కండువాలు క‌ప్పుకున్నారు. అయినా వీరి తెలంగాణ‌లో అధికార పార్టీతో ఎలాంటి వైరానికి దిగ‌లేదు.
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌లో మాత్రంపోటీ చేసి దారుణంగా ఓడిపోయింది. తాజాగా పాలేరు ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం, పాల‌మూరు ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా ఆ పార్టీ నిర‌స‌న‌ల‌కు పిలుపునివ్వ‌డం గులాబీనేత‌ల‌కు ఆగ్ర‌హం తెప్పించింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే, ఈ ఇద్ద‌రినేత‌ల‌కు సీఎం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ఆ క‌థ‌నం పేర్కొంది. మొద‌టి నుంచి జ‌గ‌న్ – కేసీఆర్ వ్య‌తిరేక వార్త‌ల‌నే ఎక్కువ‌గా రాస్తుంద‌న్న ముద్ర‌ప‌డిన ఆ ప‌త్రికలో ఇలాంటి క‌థ‌నం రావ‌డంతో చాలామంది దీన్ని లైట్ తీసుకుంటున్నారు. ఏదేమైనా దీనిపై పొంగులేటి వివ‌ర‌ణ ఇచ్చేంత‌వ‌ర‌కు దీన్ని ప్ర‌చారం కిందే భావించాలి.
First Published:  30 April 2016 12:40 AM GMT
Next Story