Telugu Global
Health & Life Style

స‌ముద్రాన్ని చూస్తే...మ‌న‌సుకి సంబ‌రం!

ఇంటికి ద‌గ్గ‌ర‌లో స‌ముద్రం ఉంటే, ఆ నీలం రంగుల‌ను క‌ళ్ల‌నిండా చూస్తూ ఉంటే మాన‌సిక ప్ర‌శాంత‌త పెరుగుతుంద‌ని, మాన‌సిక ఒత్తిడి, డిప్రెష‌న్ లాంటి ల‌క్ష‌ణాలు త‌గ్గుతాయ‌ని న్యూజీలాండ్ ప‌రిశోధ‌కులు అంటున్నారు. న్యూజీలాండ్ రాజ‌ధాని విల్లింగ్ట‌న్‌లో త‌స్మాన్‌, ప‌సిఫిక్ స‌ముద్రాలు క‌నిపించే ప్రాంతాల్లో వీరు ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించారు. ఆకుపచ్చ‌ని వాతావ‌ర‌ణం కూడా మాన‌సిక ప్ర‌శాంత‌త‌ని ఇచ్చేదే అయినా, దానికంటే స‌ముద్రం దృశ్యాలు మ‌రింత‌గా ప్ర‌భావాన్ని చూపుతున్నాయ‌ని క‌నుగొన్నారు. పార్కులు, ఇళ్ల‌ముందు చెట్లు వంటివి మ‌నుషుల అజ‌మాయిషిలో పెరుగుతున్న‌వి క‌నుక […]

స‌ముద్రాన్ని చూస్తే...మ‌న‌సుకి సంబ‌రం!
X

ఇంటికి ద‌గ్గ‌ర‌లో స‌ముద్రం ఉంటే, ఆ నీలం రంగుల‌ను క‌ళ్ల‌నిండా చూస్తూ ఉంటే మాన‌సిక ప్ర‌శాంత‌త పెరుగుతుంద‌ని, మాన‌సిక ఒత్తిడి, డిప్రెష‌న్ లాంటి ల‌క్ష‌ణాలు త‌గ్గుతాయ‌ని న్యూజీలాండ్ ప‌రిశోధ‌కులు అంటున్నారు. న్యూజీలాండ్ రాజ‌ధాని విల్లింగ్ట‌న్‌లో త‌స్మాన్‌, ప‌సిఫిక్ స‌ముద్రాలు క‌నిపించే ప్రాంతాల్లో వీరు ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించారు. ఆకుపచ్చ‌ని వాతావ‌ర‌ణం కూడా మాన‌సిక ప్ర‌శాంత‌త‌ని ఇచ్చేదే అయినా, దానికంటే స‌ముద్రం దృశ్యాలు మ‌రింత‌గా ప్ర‌భావాన్ని చూపుతున్నాయ‌ని క‌నుగొన్నారు. పార్కులు, ఇళ్ల‌ముందు చెట్లు వంటివి మ‌నుషుల అజ‌మాయిషిలో పెరుగుతున్న‌వి క‌నుక వాటి తీరులో అంత స‌హ‌జ‌త్వం ఉండ‌ద‌ని, అదే స‌ముద్ర‌మైతే పూర్తిగా ప్ర‌కృతి సిద్ధ‌మైన‌ది క‌నుక మ‌న‌సుని సేద‌తీర్చ‌డంలో ఇదే ముందు ఉంద‌ని వారు వెల్ల‌డించారు. అయితే ప‌చ్చ‌ద‌నం విష‌యానికి వ‌స్తే, స‌హ‌జ అడ‌వులు మ‌న‌కు మ‌నోల్లాసాన్ని ఇస్తాయ‌ని వారు చెబుతున్నారు.

First Published:  30 April 2016 9:34 AM GMT
Next Story