Telugu Global
NEWS

తక్ష‌ణ క‌ర్త‌వ్యం... ఒక చిలుక కావాలి

ఏపీ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని కేంద్ర మంత్రి రాజ్య‌స‌భ సాక్షిగా చెప్ప‌డంతో చంద్ర‌బాబు బృందం ఇరుకున‌ప‌డింది. ఈ ప్ర‌క‌ట‌న‌కే కేంద్రం క‌ట్టుబ‌డి ఉంటే  చంద్ర‌బాబు అయిష్టంగానైనా కేంద్రాన్ని ఎదిరించాల్సి ఉంటుంది. కానీ ప‌రిస్థితి అంత‌దూరం వెళ్ల‌కుండా ఉండేందుకు బాబు బృందం అప్పుడే రంగంలోకి దిగింద‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబు అంటే ప‌డిచ‌చ్చే ఒక కేంద్ర మంత్రి ద్వారా అప్పుడే ఎత్తు సిద్ధం చేస్తున్నార‌ట‌. ఈ ఎత్తు మ‌రీ కొత్తదేమీ కాదు పాత‌దే. గ‌తంలోనూ ఏపీకి ప్ర‌త్యేక హోదాపై కేంద్ర […]

తక్ష‌ణ క‌ర్త‌వ్యం... ఒక చిలుక కావాలి
X

ఏపీ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని కేంద్ర మంత్రి రాజ్య‌స‌భ సాక్షిగా చెప్ప‌డంతో చంద్ర‌బాబు బృందం ఇరుకున‌ప‌డింది. ఈ ప్ర‌క‌ట‌న‌కే కేంద్రం క‌ట్టుబ‌డి ఉంటే చంద్ర‌బాబు అయిష్టంగానైనా కేంద్రాన్ని ఎదిరించాల్సి ఉంటుంది. కానీ ప‌రిస్థితి అంత‌దూరం వెళ్ల‌కుండా ఉండేందుకు బాబు బృందం అప్పుడే రంగంలోకి దిగింద‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబు అంటే ప‌డిచ‌చ్చే ఒక కేంద్ర మంత్రి ద్వారా అప్పుడే ఎత్తు సిద్ధం చేస్తున్నార‌ట‌. ఈ ఎత్తు మ‌రీ కొత్తదేమీ కాదు పాత‌దే.

గ‌తంలోనూ ఏపీకి ప్ర‌త్యేక హోదాపై కేంద్ర పెద్ద‌ల ప్ర‌తికూలంగా ప‌లుమార్లు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఆ స‌మ‌యంలో వెంట‌నే రంగంలోకి దిగిన స‌ద‌రు కేంద్ర మంత్రి త‌న‌కున్న ప‌లుకుబ‌డితో స‌మ‌స్య‌ను దారి మ‌ళ్లించారు. ఒక కేంద్ర‌పెద్ద ప్ర‌త్యేక హోదా సాధ్యం కాదు అన‌గానే వెంట‌నే మ‌రో ఢిల్లీ స్థాయి నేత‌ను స‌ద‌రు కేంద్ర‌మంత్రి బుట్ట‌లోనే వేసేవారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని నేరుగా చెబితే ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతార‌ని భ‌య‌పెట్టి… ”ప్ర‌త్యేక హోదా అంశం ఇంకా ప‌రిశీల‌న‌లోనే ఉంది” అని చెప్పించేవారు. దీంతో ఏపీలో ఒక్క‌సారిగా అంద‌రూ( మీడియా) కూల్ అయిపోయేవారు.

శుక్ర‌వారం కూడా కేంద్ర‌మంత్రి ప్ర‌త్యేక హోదా ఏపీకి అవ‌స‌రం లేద‌ని రాజ్య‌స‌భ‌లో తేల్చేశారు. దీంతో బీజేపీని ఎదురించాల్సిన ప‌రిస్థితి టీడీపీకి వ‌చ్చేసింది. అదే జ‌రిగి బీజేపీని ఎదురిస్తే చంద్ర‌బాబుకు కేసుల కిరికిరి త‌ప్ప‌క‌పోవ‌చ్చు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబులో త‌న‌ను చూసుకుని మురిసిపోయే కేంద్ర మంత్రిని కూడా బీజేపీ పెద్ద‌లు ప‌క్క‌న‌పెట్టేసే చాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు ”ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు… ఇంకా ప‌రిశీల‌న‌లోనే ఉంది” అని తాము చెప్పిన మాట‌ల‌నే మీడియా ముందు చెప్పే ఒక కేంద్ర పెద్ద‌ కోసం బాబు బృందం స‌ద‌రు కేంద్ర‌మంత్రితో క‌లిసి అన్వేషిస్తోంద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ ఈసారి కూడా స‌ద‌రు కేంద్ర‌మంత్రి ఎత్తు ఫ‌లిస్తే రెండుమూడు రోజుల్లో ప్ర‌త్యేక హోదా అంశం ఇంకా పరిశీల‌న‌లో ఉంద‌న్న స్టేట్ మెంట్ ఏదో ఒక ఢిల్లీ బీజేపీ పెద్ద నుంచి వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు. కానీ ఈసారి కేంద్ర పెద్ద‌లు అంతా ఈజీగా ప్రాస‌ల‌కు ప‌డిపోతారా అని మ‌రికొంద‌రి సందేహం.

Click on Image to Read:

YS-Jagan

roja

gottipati

manikyalarao

ambati

cpi-narayana

special-status

revanth-reddy

YS-Jagan

galla-jayadev

rayapati

ntr-bhavan

konatala

ys-jagan

ysr-mysura-reddy

First Published:  30 April 2016 4:00 AM GMT
Next Story