Telugu Global
NEWS

అద్దంకిలో ఆందోళ‌న‌కు దిగిన గొట్టిపాటి వ‌ర్గీయులు

అద్దంకి టీడీపీలో అప్పుడే ర‌చ్చ‌మొద‌లైంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ ఫ్లెక్సీల‌ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గొట్టిపాటి టీడీపీలో చేరుతున్న సంద‌ర్భంగా ఈ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల‌పై దాడి చేయ‌డాన్ని గొట్టిపాటి వ‌ర్గీయులు చాలా సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. నిందితుల‌ను వెంటనే అరెస్ట్ చేయాల‌ని ఆందోళ‌న‌కు దిగారు. ఫ్లెక్సీలు చించివేత ఆక‌తాయిల ప‌నిగా గొట్టిపాటి ర‌వి చెబుతున్నారు. రెచ్చ‌గొట్టే చ‌ర్య‌లు వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. కార్యకర్తలు సంయమనం […]

అద్దంకిలో ఆందోళ‌న‌కు దిగిన గొట్టిపాటి వ‌ర్గీయులు
X

అద్దంకి టీడీపీలో అప్పుడే ర‌చ్చ‌మొద‌లైంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ ఫ్లెక్సీల‌ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గొట్టిపాటి టీడీపీలో చేరుతున్న సంద‌ర్భంగా ఈ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల‌పై దాడి చేయ‌డాన్ని గొట్టిపాటి వ‌ర్గీయులు చాలా సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. నిందితుల‌ను వెంటనే అరెస్ట్ చేయాల‌ని ఆందోళ‌న‌కు దిగారు. ఫ్లెక్సీలు చించివేత ఆక‌తాయిల ప‌నిగా గొట్టిపాటి ర‌వి చెబుతున్నారు. రెచ్చ‌గొట్టే చ‌ర్య‌లు వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. అయితే ఆయ‌న వ‌ర్గీయులు మాత్రం ఇది ముమ్మాటికి టీడీపీ సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గీయుల ప‌నే అంటున్నారు. గొట్టిపాటి రాక‌ను బ‌ల‌రాం అడ్డుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేశార‌ని.. అది సాధ్యం కాక‌పోవ‌డంతో ఇప్పుడు ఇలాంటి ప‌నులు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

Click on Image to Read:

ys-jagan

roja

YS-Jagan

manikyalarao

ambati

cpi-narayana

special-status

revanth-reddy

YS-Jagan

galla-jayadev

rayapati

ntr-bhavan

konatala

ys-jagan

ysr-mysura-reddy

First Published:  29 April 2016 10:46 PM GMT
Next Story