Telugu Global
Others

చెరుకు ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం వ‌ద్ద స‌మాధానాలున్నాయా?

తెలంగాణ ఉద్య‌మ ద్రోహి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు ఇప్పుడు కేసీఆర్‌కు కుడిభుజం ఎలా అయ్యాడు? అని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ కొత్త ప్ర‌శ్న లేవ‌నెత్తాడు. ఒక‌ప్పుడు టీఆర్ ఎస్‌లో ఉన్న చెరుకు సుధాక‌ర్ పార్టీలో ప‌రిణామాల‌తో బ‌య‌టికి వ‌చ్చేశారు.  అప్ప‌టి నుంచి గులాబీ పార్టీ విధానాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గ‌డుతూ వ‌స్తున్నారు. ఇదే క్ర‌మంలో అధికార పార్టీకి వ్య‌తిరేకంగా ఈ నెల 14న‌ తెలంగాణ స్ఫూర్తి యాత్ర కూడా చేప‌ట్టారు. ఈ యాత్ర ఓయూలో […]

చెరుకు ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం వ‌ద్ద స‌మాధానాలున్నాయా?
X

తెలంగాణ ఉద్య‌మ ద్రోహి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు ఇప్పుడు కేసీఆర్‌కు కుడిభుజం ఎలా అయ్యాడు? అని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ కొత్త ప్ర‌శ్న లేవ‌నెత్తాడు. ఒక‌ప్పుడు టీఆర్ ఎస్‌లో ఉన్న చెరుకు సుధాక‌ర్ పార్టీలో ప‌రిణామాల‌తో బ‌య‌టికి వ‌చ్చేశారు. అప్ప‌టి నుంచి గులాబీ పార్టీ విధానాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గ‌డుతూ వ‌స్తున్నారు. ఇదే క్ర‌మంలో అధికార పార్టీకి వ్య‌తిరేకంగా ఈ నెల 14న‌ తెలంగాణ స్ఫూర్తి యాత్ర కూడా చేప‌ట్టారు. ఈ యాత్ర ఓయూలో ముగిసింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌భుత్వానికి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్య‌మాన్ని అడ్డుకున్న వారిని మంత్రులుగా చేసుకుని కేసీఆర్ ఉద్య‌మ‌ద్రోహానికి పాల్ప‌డుతున్నార‌ని ధ్వ‌జమెత్తారు. క‌డియం శ్రీ‌హ‌రి, త‌ల‌సాని శ్రీ‌నివాస్‌, మ‌హేంద‌ర్, కొండా సురేఖ‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ఒక్క‌రోజైనా తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్నారా? అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సూటి ప్ర‌శ్న వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దొంగలు, లిక్కర్ మాఫియా, రౌడీలు ఏలుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ గొంతుగా ప్రజలను చైతన్య పరిచేందుకు పది జిల్లాలో నిర్వహించిన స్ఫూర్తి యాత్రకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందన్నారు. బంగారు తెలంగాణ తీసుకువస్తానన్న కేసీఆర్ బతుకులేని తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. ఖ‌మ్మంలో టీఆర్ ఎస్ పార్టీ నిర్వ‌హించింది త‌ప్ప‌కుండా దొంగ‌ల ప్లీన‌రీ అని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ రాష్ర్టాన్ని లిక్క‌ర్ మాఫియా, రౌడీలు ఏలుతున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బంగారు తెలంగాణ తెస్తాన‌న్న కేసీఆర్ రాష్ర్టాన్ని బ‌తుకులేని తెలంగాణ‌గా మార్చార‌ని ఆరోపించారు.

First Published:  1 May 2016 2:34 AM GMT
Next Story