Telugu Global
Others

క‌మ్యూనిస్టులపై క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నిజామాబాద్ ఎంపీ క‌విత క‌మ్యూనిస్టుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణకు అస‌లు క‌మ్యూనిస్టుల అవ‌స‌ర‌మే లేద‌ని అన్నారు. ఈవ్యాఖ్య‌లు విన్న ఎర్ర‌ద‌ళం నేత‌లు అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. ఎంపీ క‌విత మేడే సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో అన్ని ప‌క్షాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పోరాడుతున్నార‌ని, కాబట్టి ఇక్క‌డ క‌మ్యూనిస్టుల అవ‌స‌ర‌మే లేద‌ని ఆమె తేల్చి పారేశారు. స‌మ‌స‌మాజం రావాల‌ని, దాన్ని సాధించేందుకు విప్ల‌వం రావాల‌ని క‌మ్యూనిస్టులు కోరుతుంటారు. అయితే,వారు కోరుకున్న విప్ల‌వం సీఎం కేసీఆర్ […]

క‌మ్యూనిస్టులపై క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
నిజామాబాద్ ఎంపీ క‌విత క‌మ్యూనిస్టుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణకు అస‌లు క‌మ్యూనిస్టుల అవ‌స‌ర‌మే లేద‌ని అన్నారు. ఈవ్యాఖ్య‌లు విన్న ఎర్ర‌ద‌ళం నేత‌లు అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. ఎంపీ క‌విత మేడే సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో అన్ని ప‌క్షాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పోరాడుతున్నార‌ని, కాబట్టి ఇక్క‌డ క‌మ్యూనిస్టుల అవ‌స‌ర‌మే లేద‌ని ఆమె తేల్చి పారేశారు. స‌మ‌స‌మాజం రావాల‌ని, దాన్ని సాధించేందుకు విప్ల‌వం రావాల‌ని క‌మ్యూనిస్టులు కోరుతుంటారు. అయితే,వారు కోరుకున్న విప్ల‌వం సీఎం కేసీఆర్ ఇక్క‌డ ఎప్పుడో తెచ్చారు కాబ‌ట్టి వారి అవ‌స‌రం ఇప్పుడు తెలంగాణ‌కు లేద‌ని అన్నారు. క‌విత వ్యాఖ్య‌ల‌పై క‌మ్యూనిస్టు నేత‌లు మండిప‌డుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కార్మిక దినోత్స‌వం జ‌రుపుకుంటున్న వేళ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం త‌మ‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని ఎంపీ పై మండిప‌డుతున్నారు.
పాలేరులో పోటీ చేస్తున్నందుకేనా?
వాస్త‌వానికి తెలంగాణ‌లో మొద‌టి నుంచి క‌మ్యూనిస్టులు బ‌లంగానే ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ వారిదే కీల‌క‌పాత్ర‌. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌రువాత వారి ప్రాధాన్యం త‌గ్గినా.. పోరాటాలు మాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ అడ‌పాద‌డపా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటున్నాయంటే కార‌ణం ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆద‌ర‌ణే అని చెప్పాలి. ప్ర‌స్తుతం ఏపీలో కమ్యూనిస్టు నేత‌లు ఎలాంటి పోరాటాలు చేయ‌డం లేదు. తెలంగాణ‌లో మాత్రం ఇప్ప‌టికీ కార్మిక గొంతుక వినిపించేందుకు క‌మ్యూనిస్టులు సిద్ధంగానే ఉన్నారు. పాలేరు ఉప ఎన్నిక‌లో క‌మ్యూనిస్టులు పోటీ చేయ‌డాన్ని ఎంపీ క‌విత జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని, అందుకే త‌మ‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని క‌మ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు. వాస్త‌వానికి సీపీఎం తెలంగాణ ప్రజల కోసం పోరాడింద‌ని గుర్తు చేస్తున్నారు. ఇక‌పోతే తెలుగుదేశంతో అంట‌కాగుతుంద‌న్న విమ‌ర్శ ఉన్న సీపీఎం కు ఈ ఎన్నికలో సీపీఐ మ‌ద్ద‌తు ప‌లికింది. దీంతో ఎర్ర‌దండు పోటీలో నిలుచుంద‌న్న అక్క‌సుతో ఆమె ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.
First Published:  2 May 2016 12:35 AM GMT
Next Story