Telugu Global
Cinema & Entertainment

డ్రీమ్ గర్ల్ మరోసారి తప్పించుకుంది

అలనాటి బాలీవుడ్ అందాలతార, బీజేపీ ఎంపీ హేమామాలనీ మరోసారి పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ రెండు ప్రమాదాలు ఆమె కాన్వాయ్ కారణంగానే జరిగాయి. అదృష్టవశాత్తూ ఆ రెండు ప్రమాదాల నుంచి ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కొన్ని నెలల కిందట రాజస్థాన్ లో హేమమాలినీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆ యాక్సిడెంట్ లో రోడ్డుపై బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. హేమమాలిని చిన్నచిన్న గాయాలతో తప్పించుకుంది. తాజాగా మధురలో మరో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీన్ దయాల్ […]

డ్రీమ్ గర్ల్ మరోసారి తప్పించుకుంది
X
అలనాటి బాలీవుడ్ అందాలతార, బీజేపీ ఎంపీ హేమామాలనీ మరోసారి పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ రెండు ప్రమాదాలు ఆమె కాన్వాయ్ కారణంగానే జరిగాయి. అదృష్టవశాత్తూ ఆ రెండు ప్రమాదాల నుంచి ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కొన్ని నెలల కిందట రాజస్థాన్ లో హేమమాలినీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆ యాక్సిడెంట్ లో రోడ్డుపై బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. హేమమాలిని చిన్నచిన్న గాయాలతో తప్పించుకుంది. తాజాగా మధురలో మరో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీన్ దయాల్ వెటర్నరీ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి వెళ్తుండగా…. ఆమె కాన్వాయ్ కు చెందిన ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో… కాన్వాయ్ లోకి రెండు కార్లు ఘోరంగా గుద్దుకున్నాయి. ఈ ఘటనలో హేమమాలినీకి ఏం కాలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి కారణాల్ని అన్వేషిస్తున్నారు. ప్రతి సారి ఇలా హేమమాలినీ కాన్వాయ్ కే ప్రమాదం జరుగుతుండడంతో…. అంతర్గతంగా దర్యాప్తునకు ఆదేశించాలనే ఆలోచనలో ఎంపీ హేమమాలినీ ఉన్నారు.
First Published:  1 May 2016 10:31 PM GMT
Next Story