Telugu Global
Others

పార్టీల మ‌ధ్య పాల‌మూరు చిచ్చు!

పాల‌మూరు ప్రాజెక్టు ప్ర‌స్తుతం పార్టీల మ‌ధ్య చిచ్చు రేపుతోంది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలతో మొద‌లైన తెలంగాణ ఉద్య‌మం రాష్ట్ర విభ‌జ‌న‌తో ముగిసింది. కానీ, తాజాగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో అధికార‌పార్టీ త‌ల‌పెట్టిన పాల‌మూరు ప్రాజెక్టు క్ర‌మంగా రెండు రాష్ర్టాల స‌మ‌స్య‌గా మారుతోంది. ఈ ప్రాజెక్టు పూర్త‌యితే దిగువ‌కు నీళ్లు రావంటూ తొలుత ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.. ఆ వెంట‌నే ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ క‌ర్నూలులో నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. మ‌రోవైపు ఏపీ […]

పార్టీల మ‌ధ్య పాల‌మూరు చిచ్చు!
X
పాల‌మూరు ప్రాజెక్టు ప్ర‌స్తుతం పార్టీల మ‌ధ్య చిచ్చు రేపుతోంది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలతో మొద‌లైన తెలంగాణ ఉద్య‌మం రాష్ట్ర విభ‌జ‌న‌తో ముగిసింది. కానీ, తాజాగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో అధికార‌పార్టీ త‌ల‌పెట్టిన పాల‌మూరు ప్రాజెక్టు క్ర‌మంగా రెండు రాష్ర్టాల స‌మ‌స్య‌గా మారుతోంది. ఈ ప్రాజెక్టు పూర్త‌యితే దిగువ‌కు నీళ్లు రావంటూ తొలుత ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.. ఆ వెంట‌నే ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ క‌ర్నూలులో నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. మ‌రోవైపు ఏపీ సీఎం కూడా ఈ ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో ఏపీ సీఎం నేత తీరుపై తెలంగాణ భారీ నీటిపారుద‌ల మంత్రి హ‌రీశ్‌రావు తీవ్రంగా మండిప‌డ్డారు. ఎవ‌రు అడ్డొచ్చినా పాల‌మూరును క‌ట్టి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ప్రాజెక్టును ఆప‌లేరని తేల్చి చెప్పారు. మా ప్రాజెక్టు అక్ర‌మమ‌నే ఏపీ ప్ర‌భుత్వం ఎవ‌రి అనుమ‌తితో ప‌ట్టిసీమ‌ను చేప‌ట్టింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లతో పార్టీలు నిట్ట‌నిలువునా చీలిపోయాయి.
గులాబీ నేత‌ల ఆరోప‌ణ‌లు పాలేరు కోస‌మేనా?
రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి మ‌ర‌ణంతో పాలేరుకు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈస్థానంలో టీఆర్ ఎస్ పోటీ చేస్తోంది. ఇక్క‌డ టీడీపీ, వైసీపీలు పోటీ నుంచి త‌ప్పుకున్నాయి. ఈ స‌మ‌యంలో ఏపీ కాంగ్రెస్ నేత‌లు పాల‌మూరు ప్రాజెక్టు కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పింది. టీడీపీ కూడా కేంద్రానికి లేఖ రాసింది. దీంతో పాల‌మూరు విష‌యంలో ఈ రెండుపార్టీలు తెలంగాణ ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని గులాబీపార్టీ ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతోంది. దీంతో ఏపీ కాంగ్రెస్‌, టీడీపీల‌కు ఈ విష‌యంలో ఏం మాట్లాడాలో తెలియ‌ని సంక‌ట ప‌రిస్థితి నెల‌కొంది. ఈ విషయంలో మాట‌ల దాడి ఎంత పెరిగితే.. పాలేరు ఉప ఎన్నిక‌లో టీఆర్ ఎస్‌కు అంత‌గా లాభిస్తుంద‌న్న‌ది సుస్ప‌ష్టం. మ‌రి ఈ గండాన్ని కాంగ్రెస్‌, టీడీపీలు ఎలా దాటుతాయ‌న్న‌ది ఆసక్తిగా మారింది.
First Published:  2 May 2016 12:40 AM GMT
Next Story