Telugu Global
Cinema & Entertainment

మరో టీజర్ తో పిచ్చెక్కించిన మహేష్

ఉగాదికే రావాల్సిన ఓ టీజర్ ను తాజాగా విడుదల చేసింది బ్రహ్మోత్సవం టీం. ఆడియో ఫంక్షన్ దగ్గరపడుతుండడంతో సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని అధికారికంగా షురూ చేశారు. ఇప్పటికే ఓ టీజర్ ను విడుదల చేయగా… దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఓ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అది కూడా క్లిక్కయింది. ఇప్పుడు మరో సాంగ్ టీజర్ విడుదలైంది. ఇది కూడా నెట్ లో క్షణాల్లో పాకిపోయింది. అందరికీ విపరీతంగా నచ్చేసింది. ఈ టీజర్స్ విడుదల […]

మరో టీజర్ తో పిచ్చెక్కించిన మహేష్
X
ఉగాదికే రావాల్సిన ఓ టీజర్ ను తాజాగా విడుదల చేసింది బ్రహ్మోత్సవం టీం. ఆడియో ఫంక్షన్ దగ్గరపడుతుండడంతో సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని అధికారికంగా షురూ చేశారు. ఇప్పటికే ఓ టీజర్ ను విడుదల చేయగా… దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఓ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అది కూడా క్లిక్కయింది. ఇప్పుడు మరో సాంగ్ టీజర్ విడుదలైంది. ఇది కూడా నెట్ లో క్షణాల్లో పాకిపోయింది. అందరికీ విపరీతంగా నచ్చేసింది. ఈ టీజర్స్ విడుదల కార్యక్రమాల మధ్యలో వచ్చిన కొన్ని పోస్టర్లు కూడా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేశాయి. బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించి ఇలా ఎన్ని విడుదల చేస్తున్నా… అన్నింట్లో కామన్ గా కనిపించే పాయింట్ మహేష్. అవును… 40ల్లో కూడా పాతికేళ్ల కుర్రాడిలా మహేష్ మెరిసిపోతున్నాడు. మహేష్ ఛార్మింగ్ కు తోడు శ్రీకాంత్ అడ్డాల సృష్టించిన స్క్రీన్ కూడా కలర్ ఫుల్ గా మెరిసిపోతుండడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రేక్షకులు సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. పోస్టర్లలో అక్కడక్కడ మహేష్ తో సమంత కనిపించినప్పటికీ… ఇప్పటివరకు విడుదలైన 2 టీజర్లను మాత్రం అచ్చంగా మహేష్ బాబుకే అంకితమిచ్చాడు. 7న జరగనున్న ఆడియో ఫంక్షన్ లో థియేట్రికల్ ట్రయిలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదల తేదీని కూడా అదే రోజు ప్రకటించే అవకాశముంది.
First Published:  1 May 2016 10:35 PM GMT
Next Story