Telugu Global
NEWS

నా వియ్యంకుడికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఎగ్గొట్టారు

వైసీపీని వీడిన మైసూరారెడ్డి ఆదివారం ఒక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు. పార్టీలో త‌న‌కు స‌రైన గౌర‌వం ద‌క్క‌లేద‌ని చెప్పిన మైసూరారెడ్డి… పార్టీ వీడ‌డానికి గ‌ల మ‌రో ముఖ్య‌కార‌ణం చెప్పారు. నాలుగేళ్లుగా పార్టీ కోసం ప‌నిచేసినా వైసీపీ నుంచి గానీ, జ‌గ‌న్ నుంచి గానీ ఎలాంటి సాయం లేద‌న్నారు. పైగా త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నులు చేశార‌ని చెప్పారు. త‌న వియ్యంకుడికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామ‌ని చెప్పి జ‌గ‌న్ మాట త‌ప్పార‌ని మైసూరారెడ్డి అన్నారు. జ‌గ‌న్ మాట న‌మ్మి […]

నా వియ్యంకుడికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఎగ్గొట్టారు
X

వైసీపీని వీడిన మైసూరారెడ్డి ఆదివారం ఒక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు. పార్టీలో త‌న‌కు స‌రైన గౌర‌వం ద‌క్క‌లేద‌ని చెప్పిన మైసూరారెడ్డి… పార్టీ వీడ‌డానికి గ‌ల మ‌రో ముఖ్య‌కార‌ణం చెప్పారు. నాలుగేళ్లుగా పార్టీ కోసం ప‌నిచేసినా వైసీపీ నుంచి గానీ, జ‌గ‌న్ నుంచి గానీ ఎలాంటి సాయం లేద‌న్నారు. పైగా త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నులు చేశార‌ని చెప్పారు. త‌న వియ్యంకుడికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామ‌ని చెప్పి జ‌గ‌న్ మాట త‌ప్పార‌ని మైసూరారెడ్డి అన్నారు. జ‌గ‌న్ మాట న‌మ్మి త‌న వియ్యంకుడు ఎన్నిక‌ల ఏజెంటుగానూ కూర్చున్నార‌ని వెల్ల‌డించారు. కానీ ఆదినారాయ‌ణ రెడ్డి పార్టీ వీడుతార‌ని తెలుసుకుని ఎమ్మెల్సీ సీటును ఆదినారాయ‌ణ‌రెడ్డి సోద‌రుడికి ఇచ్చార‌ని మైసూరా ఆరోపించారు. కుటుంబాల్లో జ‌గ‌న్ చిచ్చుపెట్టార‌ని ఆరోపించారు.

జగన్‌పై కేసుల అంశం సోనియాకు, జ‌గ‌న్‌కు సంబంధించిన‌దని టీడీపీ ప్ర‌మేయం ఎక్క‌డుంద‌ని మైసూరారెడ్డి ప్ర‌శ్నించారు. త‌న చేతిలోని సిమెంట్ కంపెనీకి మైనింగ్ లీజుతో పాటు ప‌ర్యావ‌ర‌ణ అనుమతులు కూడా ఉన్నాయ‌న్నారు. ఇంకా కావాల్సిన భూమిని ప్ర‌భుత్వం ఇస్తే తీసుకుంటాన‌ని లేదంటే ప్రైవేట్ వ్య‌క్తుల నుంచి కొనుక్కుంటాన‌ని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీ కొంటుంటే అదే డ‌బ్బు జ‌గ‌నే ఇచ్చి ఎమ్మెల్యేల‌ను నిలుపుకోవ‌చ్చు క‌దా అని మైసూరా అన్నారు. తాను ఐర‌న్ లెగ్ అయితే వైసీపీ వాళ్లు వెంట‌ప‌డి ఎందుకు చేర్చుకున్నార‌ని మైసూరారెడ్డి ప్ర‌శ్నించారు.

Click on Image to Read:

Ponguleti-Srinivas-reddy

macharla

adinarayana-reddy

jagan-dasari

pavan-rgv

kcr

Jalil-Khan,-Vellampalli-Sri

amaravathi

ycp

YS-Jagan

First Published:  1 May 2016 9:43 PM GMT
Next Story