Telugu Global
NEWS

వ్యూహం మార్చిన విజ‌య‌శాంతి

సినిమాల్లో ఒక‌వెలుగు వెలిగి అనంత‌రం రాజ‌కీయాల్లో త‌న‌టూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విజ‌య‌శాంతి కొద్ది రోజులుగా తెర‌మ‌రుగు అయ్యారు. ఎన్నిక‌ల వేళ టీఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన రాముల‌మ్మ ప‌ప్పులో కాలేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు జ‌నం ప‌ట్టం క‌డుతార‌నుకుని న‌మ్మి హ‌స్తం పార్టీలో చేరారు. అయితే మెద‌క్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అప్ప‌టి నుంచి విజ‌య‌శాంతి గురించి పెద్ద‌గా ప్ర‌స్తావ‌న లేకుండా పోయింది. అయితే… విజ‌య‌శాంతి ఇప్పుడు రెండు […]

వ్యూహం మార్చిన విజ‌య‌శాంతి
X

సినిమాల్లో ఒక‌వెలుగు వెలిగి అనంత‌రం రాజ‌కీయాల్లో త‌న‌టూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విజ‌య‌శాంతి కొద్ది రోజులుగా తెర‌మ‌రుగు అయ్యారు. ఎన్నిక‌ల వేళ టీఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన రాముల‌మ్మ ప‌ప్పులో కాలేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు జ‌నం ప‌ట్టం క‌డుతార‌నుకుని న‌మ్మి హ‌స్తం పార్టీలో చేరారు. అయితే మెద‌క్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అప్ప‌టి నుంచి విజ‌య‌శాంతి గురించి పెద్ద‌గా ప్ర‌స్తావ‌న లేకుండా పోయింది. అయితే…

విజ‌య‌శాంతి ఇప్పుడు రెండు వ్యూహాల‌ను సిద్ధం చేసుకున్నారట. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా సమ‌యం ఉంది కాబ‌ట్టి ఇప్పుడే తొంద‌ర‌ప‌డ‌డం స‌రికాద‌న్న భావ‌న‌కు ఆమె వ‌చ్చార‌ని చెబుతున్నారు. అందుకే ప్ర‌స్తుతానికి సినిమాల్లో న‌టించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇప్ప‌టికే రెండు భారీ సినిమాల్లో ఆమె చాన్స్ కొట్టేశార‌ని చెబుతున్నారు. ఓసేయ్ రాములమ్మ సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటున్నారు.

సినిమాల‌కు అవ‌స‌ర‌మైన బాడీ ఫిట్‌నెస్ కోసం విజ‌య‌శాంతి క‌స‌ర‌త్తులు కూడా చేస్తున్నార‌ని స‌మాచారం. ఇలా కొన్నేళ్ల పాటు సినిమాల్లో న‌టించి 2018నాటికి పూర్తి స్థాయిలో తిరిగి రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌ని ఆమె భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నేత‌లు వ‌రుస‌పెట్టి వ‌ల‌స వెళ్ల‌డంపైనా ఆమె ఆగ్ర‌హంగా ఉన్నార‌ని చెబుతున్నారు. ఒక విధంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యూహాన్ని విజ‌య‌శాంతి ఫాలో అవుతున్నార‌ని భావిస్తున్నారు. ప‌వ‌న్ కూడా మొన్న‌టి ఎన్నిక‌ల స‌మయంలో జ‌న‌సేన పేరుతో తెర‌పైకి వ‌చ్చి ఫ‌లితాల‌ను తారుమారు చేశారు. ప్ర‌శ్నిస్తానని చెప్పి అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే ట్విట్ట‌ర్‌లో స్పందిస్తున్నారు.

ఆయ‌న కూడా తీరా ఎన్నిక‌ల స‌మ‌యంలో అంటే 2018లో రాజ‌కీయాల్లో తిరిగి యాక్టివ్ అవడం ద్వారా అటో ఇటో తేల్చుకోవాల‌నుకుంటున్నారు. వీరి వ్యూహం బాగానే ఉంది. ప్ర‌తిప‌క్ష పార్టీగా ఐదేళ్ల పాటు రోడ్ల‌మీద ప‌డి క‌ష్ట‌ప‌డ‌కుండా తీరా ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌లు, ఏడాది ముందు రంగంలోకి దిగి సినీ గ్లామ‌ర్‌తో జ‌నాన్ని బుట్ట‌లో వేసుకోవ‌చ్చు అనుకుంటున్నారు.

Click on Image to Read:

chandrababu-naidu

mysura

mysura1

adinarayana-reddy

jagan-dasari

pavan-rgv

kcr

Jalil-Khan,-Vellampalli-Sri

amaravathi

ycp

YS-Jagan

First Published:  1 May 2016 1:50 PM GMT
Next Story