Telugu Global
CRIME

ఆ దుండ‌గుడి పేరు... అక్ష‌య్‌!

ఓ గ‌ద్ద చిన్న పక్షిని  నోట క‌రుచుకుని వెళ్లినంత తేలిగ్గా….రోడ్డుమీద నిల‌బడిన ఒక యువ‌తిని ఓ దుండ‌గుడు అమాంతం ఎత్తుకువెళ్ల‌టం సిసిటివి కెమెరాలో రికార్డ‌యి సంచ‌ల‌నం సృష్టించింది. ద‌క్షిణ బెంగ‌ళూరులో అన్నీ ఇళ్లే ఉన్న క‌త్రి గుప్పే అనే ప్రాంతంలో గ‌త నెల 23న ఇది జ‌రిగింది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశామ‌ని, అత‌ని పేరు అక్ష‌య్ అని పోలీసులు వెల్ల‌డించారు. సిసిటివి ఫుటేజి బ‌య‌ట‌కు వ‌చ్చాక, దీనిపై విప‌రీతంగా ఆందోళ‌న వ్య‌క్తం అయ్యింది. ఆ […]

ఓ గ‌ద్ద చిన్న పక్షిని నోట క‌రుచుకుని వెళ్లినంత తేలిగ్గా….రోడ్డుమీద నిల‌బడిన ఒక యువ‌తిని ఓ దుండ‌గుడు అమాంతం ఎత్తుకువెళ్ల‌టం సిసిటివి కెమెరాలో రికార్డ‌యి సంచ‌ల‌నం సృష్టించింది. ద‌క్షిణ బెంగ‌ళూరులో అన్నీ ఇళ్లే ఉన్న క‌త్రి గుప్పే అనే ప్రాంతంలో గ‌త నెల 23న ఇది జ‌రిగింది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశామ‌ని, అత‌ని పేరు అక్ష‌య్ అని పోలీసులు వెల్ల‌డించారు.

సిసిటివి ఫుటేజి బ‌య‌ట‌కు వ‌చ్చాక, దీనిపై విప‌రీతంగా ఆందోళ‌న వ్య‌క్తం అయ్యింది. ఆ యువ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న‌పై జ‌రిగిన అత్యాచార ప్ర‌య‌త్నం గురించి చెప్పింది. తాను పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న ఇంటికి స‌మీపంలోనే నిల‌బ‌డి ఫోన్లో మాట్లాడుతుండ‌గా దుండ‌గుడు త‌న‌ను ఎత్తుకుని నిర్మాణంలో ఉన్న ఒక భ‌వనంలోకి తీసుకువెళ్లాడ‌ని ఆమె చెప్పింది. ఇద్ద‌రి మ‌ధ్య పెనుగులాట‌లో అత‌ను త‌న‌ని కొట్టాడ‌ని, తాను దాదాపు అయిదునిముషాల‌పాటు స్పృహ కోల్పోయాన‌ని తెలిపింది. తాను క‌ళ్లు తెరిచేసరికి అత‌ను అక్క‌డి నుండి వెళ్లిపోయాడ‌ని ఆమె పేర్కొంది. అత‌ను త‌న‌ని ఎత్తుకువెళుతున్న‌పుడు అక్క‌డ జ‌నం తిరుగుతూనే ఉన్నా ఏ ఒక్క‌రూ ప‌ట్టించుకోలేద‌ని ఆ యువ‌తి చెప్పింది. త‌న బ్యాగు, ప‌ర్సు, ఫోను అన్నీఉన్నా వ‌దిలేసి వెళ్లిపోయాడు కాబ‌ట్టి అత‌ను త‌న‌పై అత్యాచారం చేసేందుకే తీసుకువెళ్లాడ‌ని ఆమె తెలిపింది. ఏదిఏమైనా దుండ‌గుడిని అరెస్టు చేయ‌డంపై ఆమె సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. అత‌డికి క‌ఠిన శిక్ష విధించాల‌ని కోరింది.

First Published:  3 May 2016 5:05 AM GMT
Next Story