Telugu Global
National

ల‌క్నో యూనివ‌ర్శిటీ క్యాంప‌స్‌లో మాంసాహారంపై నిషేధం!

ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ల‌క్నోలో బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్క‌ర్ యూనివ‌ర్శిటీ మెస్‌లో మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించారు. యూనివ‌ర్శిటీ అధికారులు ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న జారీ చేశారు. యూనివ‌ర్శిటీ మెస్‌లో కేవ‌లం శాకాహారం మాత్ర‌మే వ‌డ్డిస్తార‌ని, ప్ర‌త్యేక సంద‌ర్భాల‌కు కూడా మాంసాహారాన్ని తినే వీలు లేద‌ని యూనివ‌ర్శిటీ అధికార ప్ర‌తినిధి క‌మ‌ల్ జైస్వాల్ అన్నారు. ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల‌తో క్యాంప‌స్ వాతావ‌ర‌ణం ఉద్రిక్తంగా మార‌టంతో  యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఈ నిషేధం త‌రువాత మంగ‌ళ‌వారం […]

ల‌క్నో యూనివ‌ర్శిటీ క్యాంప‌స్‌లో మాంసాహారంపై నిషేధం!
X

ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ల‌క్నోలో బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్క‌ర్ యూనివ‌ర్శిటీ మెస్‌లో మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించారు. యూనివ‌ర్శిటీ అధికారులు ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న జారీ చేశారు. యూనివ‌ర్శిటీ మెస్‌లో కేవ‌లం శాకాహారం మాత్ర‌మే వ‌డ్డిస్తార‌ని, ప్ర‌త్యేక సంద‌ర్భాల‌కు కూడా మాంసాహారాన్ని తినే వీలు లేద‌ని యూనివ‌ర్శిటీ అధికార ప్ర‌తినిధి క‌మ‌ల్ జైస్వాల్ అన్నారు. ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల‌తో క్యాంప‌స్ వాతావ‌ర‌ణం ఉద్రిక్తంగా మార‌టంతో యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఈ నిషేధం త‌రువాత మంగ‌ళ‌వారం దాదాపు 200 మంది విద్యార్థుల‌తో ర్యాలీని నిర్వ‌హించిన విద్యార్థి నాయ‌కులు మాంసాహారంపై నిషేధం విధించడాన్ని వ్య‌తిరేకించారు. ఈ నిర్ణ‌యం ద‌ళిత వ్య‌తిరేక‌మ‌ని వారు ఆరోపించారు. కాంగ్రెస్ నాయ‌కులు యూనివ‌ర్శిటీ నిర్ణ‌యాన్ని ఖండిస్తుండ‌గా, బిజెపి నాయ‌కులు స‌మ‌ర్ధించుకున్నారు.

First Published:  3 May 2016 4:02 AM GMT
Next Story