Telugu Global
Others

బీజేపీ ఎదురుదాడితో ఇర‌కాటంలో వీహెచ్‌!

కొంత‌కాలంగా వీహెచ్ కు కాలం కలిసిరావ‌డం లేదు. తాను విసిరిన విమ‌ర్శ‌నాస్ర్తాలు తిరిగే త‌న‌కే త‌గిలి త‌ల బొప్పి క‌డుతున్నా… ఆయ‌న మాత్రం త‌న తీరు మార్చుకోవ‌డం లేదు. ఇటీవ‌ల సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ వీసీ అప్పారావును తొల‌గించాలంటూ హైకోర్టులో వేసిన పిటిష‌న్ విచార‌ణ స‌మ‌యంలో నేను ఎంపీనంటూ అర‌వ‌డంతో న్యాయ‌మూర్తి వీహెచ్‌పై ఆగ్ర‌హించిన సంగ‌తి తెలిసిందే! ఈ సంగ‌తి మ‌ర‌వ‌క‌ముందే.. ఆయ‌న మ‌రోసారి ఇర‌కాటంలో ప‌డ్డారు. అగ్ర‌కులాల‌కు రిజ‌ర్వేష‌న్ల అమ‌లు విష‌యంలో కేంద్రం తీరును ఎండ‌గ‌డ‌దామ‌నుకున్న వీహెచ్ […]

బీజేపీ ఎదురుదాడితో ఇర‌కాటంలో వీహెచ్‌!
X

కొంత‌కాలంగా వీహెచ్ కు కాలం కలిసిరావ‌డం లేదు. తాను విసిరిన విమ‌ర్శ‌నాస్ర్తాలు తిరిగే త‌న‌కే త‌గిలి త‌ల బొప్పి క‌డుతున్నా… ఆయ‌న మాత్రం త‌న తీరు మార్చుకోవ‌డం లేదు. ఇటీవ‌ల సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ వీసీ అప్పారావును తొల‌గించాలంటూ హైకోర్టులో వేసిన పిటిష‌న్ విచార‌ణ స‌మ‌యంలో నేను ఎంపీనంటూ అర‌వ‌డంతో న్యాయ‌మూర్తి వీహెచ్‌పై ఆగ్ర‌హించిన సంగ‌తి తెలిసిందే! ఈ సంగ‌తి మ‌ర‌వ‌క‌ముందే.. ఆయ‌న మ‌రోసారి ఇర‌కాటంలో ప‌డ్డారు. అగ్ర‌కులాల‌కు రిజ‌ర్వేష‌న్ల అమ‌లు విష‌యంలో కేంద్రం తీరును ఎండ‌గ‌డ‌దామ‌నుకున్న వీహెచ్ కు అంతేవేగంతో బీజేపీ కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చింది.

కేంద్రం అగ్ర‌కులాల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ వీహెచ్ ప్ర‌స్తావించారు. రాజ్య‌స‌భ‌లో జీరోఅవ‌ర్‌లో మాట్లాడిన ఆయ‌న ఈ అంశాన్ని లేవనెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అగ్రవర్ణాలకు దొడ్డి దారిన రిజర్వేషన్‌ కల్పిస్తున్నారని వీహెచ్‌ ఆరోపించారు. అందరికీ రిజర్వేషన్‌ కల్పించాలనుకుంటే బహిరంగంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేద‌రికం కార‌ణంగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌కూడ‌ద‌న్న సుప్రీం తీర్పుకు ఇది వ్య‌తిరేక‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. ద‌శాబ్దాల వారీగా సామాజికంగా వివ‌క్ష‌కు గురైన వారికే రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాలని, అన్ని కులాల వారికి ఇస్తే.. ఇంక రిజ‌ర్వేష‌న్ల ప్ర‌క్రియ‌కు అర్థం లేద‌న్నారు.

మీరెందుకు అమ‌లు చేయ‌లేదు : బీజేపీ
రిజ‌ర్వేష‌న్ల‌పై రాజ్య‌స‌భ‌లో మాట్లాడిన వీహెచ్‌కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ కౌంట‌ర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ గ‌తంలో 10 ఏళ్ల‌పాటు అధికారంలో ఉన్న‌పుడు మీరెందుకు ప్ర‌యివేటు రంగంలో ఓబీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌లేక‌పోయార‌ని ప్ర‌శ్నించింది. అధికారంలో ఉన్నంత సేపు ఆ అంశాన్ని ప‌ట్టించుకోని వీహెచ్ ఇప్పుడు సోనియా మెప్పు పొందేందుకే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మండిప‌డింది. అయితే, ఈ వ్యాఖ్య‌ల‌తో వీహెచ్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారు. బీజేపీ నేత‌లు చెప్పిన‌దాంట్లోనూ పాయింట్ ఉంది క‌దా! అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

First Published:  3 May 2016 11:16 PM GMT
Next Story